ఏకంగా ప్రధాని భవనాన్నే అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆదేశానికి. ఖజానా ఖాళీ అవ్వడంతో…నిధులను సమకూర్చుకునేందుకు ప్రధాని నివాసాన్నే రెంట్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ దేశం ఎదనేదేగా మీ డౌట్…భారత్ తో ఎప్పుడు కయ్యానికీ కాలుదువ్వె పాకిస్తాన్ లోనే ఇదంతా.

పాక్ ఆర్ధిక పరిస్థితి మారీ దిగజారింది. ఎంతలా అంటే ప్రధాని భవనాన్ని అద్దెకు ఇచ్చేంతలా. ఖాజానా ఖాళీ అవ్వడంతో నిధుల అన్వేషణలో పీఎం బిల్డింగ్ ను అద్దెకు ఇవ్వాలని పాక్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా మినహా ప్రపంచ దేశాలు పాక్ ను విశ్వసించడం లేదు. దీంతో బయట దేశాలు కూడా పాక్ కు చేయూత ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పీఎం భవనమే అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకునట్లు ప్రచారం జరుగుతోంది. 2019లో ఇమ్రాన్ ఖాన్ ఈ భవనాన్నిఉ ఖాళీ చేశారు. దాంతో ఈ భవనాన్ని విశ్వవిద్యాలయంగా మారుస్తారని ప్రచారం జరిగినా…కల్చరల్, ఫ్యాషన్ సహా పలు ఈవెంట్ల కోసం అద్దెకు ఇవ్వాలని నిర్ణయించనట్లు ప్రచారం మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలో జరిగే కేబినెట్ భేటీలో ఈ భవనంపైనే ప్రధానంగా చర్చిస్తారని అంటున్నారు.