సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తోన్న టి. పోలీసులు

తెలంగాణ పోలీసులు తీరేమి మారడం లేదు. సుప్రీంకోర్టు హెచ్చరించినా లైట్ తీసుకుంటున్నారు. పీడీ చట్టం అత్యంత క్రూరమైన చట్టమని…దాని ప్రయోగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా తెలంగాణ పోలీసులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సుప్రీం అలా చెప్పి నెల రోజులు తిరక్కుండానే మరో 31 మందిని పోలీస్ శాఖ పీడీ యాక్ట్ కింద నిర్బంధించింది. ఇదే ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

Firecrackers ban | Supreme Court modifies Telangana High Court order - The  Hindu

పీడీ చట్టం అత్యంత క్రూరమైన చట్టమని…శాంతి భద్రతలకు ఆటంకం కల్గిస్తారని దాని ప్రయోగించవద్దని సుప్రీం తెలంగాణ పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు అలా చెప్పి నెల రోజులు కాకుండానే మరో 31 మందిపై పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 22 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9 మందిని అదుపులోకి తీసుకుంది. వీరంతా సైబర్ మోసాలకు పాల్పడిన పలువురు, డ్రగ్ పెడ్లర్లు, చైన్ స్నాచర్లు, హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు.

Hyderabad 31 Detained Under PD Act After Supreme Court Terms It Draconian -  Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

తెలంగాణలో పీడీ యాక్ట్ దుర్వినియోగం అవుతోందని…ఈ చట్టం గురించి అక్కడ ప్రశ్నించే వారే లేరా అని విస్మయం వ్యక్తం చేసింది న్యాయస్థానం. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. బెయిల్ మంజూరు అయిన వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరైతే.. దాని రద్దుకు ప్రభుత్వం అప్పీలు చేయాలే కానీ.. బెయిల్ వచ్చిందన్న కారణంతో పీడీ చట్టాన్ని ప్రయోగించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ పోలీసులు మాత్రం తమ పని తాము పనిచేసుకుపోతున్నారు. మరోవైపు పోలీసులు.. పీడీయాక్ట్ కింద వారిని అరెస్ట్ చేయడం తప్పుగా అనుకోవడం లేదని.. ప్రజల భద్రత దృష్ట్యానే వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని సమర్థించుకుంటున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.