తూర్పుగోదావరి జిల్లా తొట్టంబెడు మండలంలో వింత సంఘటన చోటుచేసుకుంది. కోడిపుంజు గుడ్లు పెట్టడమే కాకుండా, ఆ గుడ్డును పొదిగి పిల్లలను కూడా చేసి అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీలోని సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంట్లో నాలుగు కోళ్లతోపాటు.. ఒక పుంజు కూడా ఉంది. ఆ కోడిపుంజు ఐదు గుడ్లు పెట్టడంతో సుబ్రహ్మణ్యం రెడ్డి ఆశ్చర్యపోయారు. ఇదేంటి కోడిపుంజు గుడ్లు పెట్టడం ఏంటని షాక్ కు గురయ్యారు. అయితే గుడ్లు పెట్టినా పుంజు…గుడ్లను పొదిగి పిల్లలను చేస్తుందో లేదో చూద్దామని ఆ గుడ్లు తీసుకెళ్లి పుంజు కిందపెట్టడంతో అది 5 పిల్లలను పొదిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కోడిపుంజును, పిల్లలను చూసి వెళ్తున్నారు. అయితే పుంజు గుడ్లు పెట్టడంపై వెటర్నరీ వివరణ ఇచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు.