దళిత బందును హుజురాబాద్ లో కాకుండా మొదట వాసాలమర్రిలో అమలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ డిబేట్ గా మారింది. ఎందుకు కేసీఆర్ ఇలా చేశారని అంతా చెవులు కోరుకుంటున్నారు. హుజురాబాద్ లో ప్రారంభం అవుతుందని చెప్పి అసలు ఏ ఆర్భాటం లేకుండా వాసాలమర్రిలో అమలు చేయడం ఎంటా అని అంత చర్చిస్తున్నారు. ఈ ఎపిసోడ్ ను అంత విశ్లేషిస్తే ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే వాసాలమర్రిలో దళిత బందును కేసీఆర్ అమలు చేసినట్లు తెలుస్తోంది.
దళిత బంధు ప్రారంభోత్సవానికి హుజురాబాద్ నే ఎందుకు వేదికగా ఎంచుకున్నారు…?దళితులకు మేలు చేసే ఈ బంధు పథకాన్ని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నలు వెల్లువేత్తుతున్నాయి. పైగా ఎన్నికల కోణంలో ఆలోచించి ఈ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ లో అమలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో పిల్ కూడా వేశారు. దీనిపై నిన్న విచారణ కూడా జరిగింది. దీంతో అక్కడి నుంచి ఏమైనా అడ్డంకులు వచ్చే ప్రమాదం ఉందని పసిగట్టిన కేసీఆర్…ముందు జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది.
హుజురాబాద్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభోత్సవం చేయవద్దని కోర్టుచెప్పిందే అనుకో…ఉప ఎన్నికల్లో ఓట్లు రావనే భయం టీఆర్ఎస్ కు పట్టుకుంది. ఉప ఎన్నికల తరువాత అమలు చేస్తామని చెప్పినా…అది కూడా జీహెచ్ఎంసి వరద బాధితుల సహాయం లాగే అవుతుందని హుజురాబాద్ ప్రజలు అనుకుంటే చేసేదేమీ ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా హుజురాబాద్ లో కాకుండా వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై ప్రకటన వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచే నిధులను మంజూరు చేస్తునట్లు ప్రకటించేసినట్లు ఉన్నారని అభిప్రాయ పడుతున్నారు.