వాసాలమర్రిలో దళిత బంధు-ఏంటీ స్ట్రాటజీ కేసీఆర్..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎం చేసినా దాని వెనక పెద్ద కథే ఉంటుంది. హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని చెప్పిన దళిత బంధు పథకాన్ని వాసాలమర్రిలో అమలు చేస్తున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు కేసీఆర్. ఎందుకు ఆయన ఇలా అనూహ్య నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది.

వాసాల‌మ‌ర్రి ద‌ళితుల అకౌంట్ల‌లో రేపే 10 ల‌క్ష‌ల చొప్పున‌ జ‌మ‌ : సీఎం  కేసీఆర్ | CM KCR Announce On Dalitha Bandhu In Vasalamarri

హుజురాబాద్ నుంచే దళిత బంధు పథకానికి శ్రీకారం చుడతామని చెప్పిన కేసీఆర్…అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16న దళిత బంధు పథకం ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు చేస్తూనే…మరో వైపు కేసీఆర్ దత్తత్త గ్రామం వాసాలమర్రిలో దళిత బంధు మొదలు పెడుతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు కేసీఆర్. ఈవాళ అందరి చేతుల్లో 10 లక్షలు ఉంటాయని షాకింగ్ ప్రకటన చేశారు కేసీఆర్. దళిత బంధు ద్వారా మంజూరు అయ్యే డబ్బులతో మంచి వ్యాపారం చేసుకొని…ఆర్థికంగా పరిపుష్టి చెందాలని కేసీఆర్ సూచించారు. కేసీఆర్ చేసిన ప్రక‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చనీయాంశంగా మారింది.

Vasalamarri : వాసాల‌మ‌ర్రి ద‌ళితుల అకౌంట్ల‌లో రేపే 10 ల‌క్ష‌ల చొప్పున‌ జ‌మ‌  : సీఎం కేసీఆర్ - Namasthe Telangana

హుజురాబాద్ కంటే ముందుగానే వాసాలమర్రిలో దళిత బంధు అమలు వెనక పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. రాజకీయ లబ్ది కోసమే హుజురాబాద్ లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పలువురు హైకోర్టుతోపాటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి, ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందోనని పసిగట్టిన కేసీఆర్…ఆ ఆరోపణలకు సహేతుకత లేకుండా చేసేందుకు వాసాలమర్రిలో ఈ దళిత బంధు అమలు నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ప‌థ‌కం రాజకీయ ల‌బ్ధి కోసం తీసుకొచ్చింది కాద‌ని …ఈసీ కూడా ఎలాంటి చ‌ర్యలు తీసుకునే చాన్స్ ఉండ‌బోద‌న్నది కేసీఆర్ వ్యూహ‌మ‌ని పెర్కొంటున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.