రేవంత్ కు ఇంటి దొంగల పోటు..?

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతుండగా…మళ్ళీ డేంజర్ జోన్ లోకి నేట్టేసేందుకు ఇంటి దొంగలు ప్రయత్నాలు చేస్తున్నారా..? టీ. పీసీసీ అద్యక్షుడిగా రేవంత్ దూకుడుకు కళ్ళెం వేసేందుకు అదును కోసం వేచి చూస్తున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

ఇంద్రవెళ్లిలో దలిత, గిరిజన దండోరా సభను నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే ఈ సభను అట్టర్ ప్లాప్ చేయాలనీ సొంత పార్టీ నేతలే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమం విజయవంతం కావడంతో జీర్ణించుకోలేని కొంతమంది రేవంత్ వ్యతిరేకులు…ఆయన దూకుడుకు బ్రేక్ లు వేసేందుకు వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే దళిత బంధు అసలు స్టంట్ ను దళితులను వివరించేందుకు రేవంత్..ఇంద్రవెళ్లిలో ద‌ళిత, గిరిజ‌న ఆత్మగౌరవ దండోరాకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ అసమర్ధతను, లోగోట్టును వివరించేందుకు వరుసగా నిరసన కార్యక్రమాలు చేపట్టి..ఇప్పుడు సభ ద్వారా ప్రజలను జాగృతం చేయాలనీ రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది పార్టీలో కొందరు నేతలకు కంటగింపుగా మారినట్టుగా తెలుస్తోంది. ఇంద్రవెల్లిలో నిర్వహించాలనుకుంటున్న సభకు ఎలాగైనా బ్రేకులు వేయాలని.. కుదరకపోతే కనీసం ప్లాఫ్ అయినా చేయాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.

ఇంద్రవెల్లిలో సభ గురించి తమకు చెప్పకుండానే నిర్ణయం తీసుకుంటారా అని…ఈ కార్యక్రమాన్ని ప్లాప్ చేసేందుకు కొంతమంది వివాదం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. మరికొంతమంది అయితే…వారికీ తెలిసిన దారుల్లో సమస్యలు తెచ్చేలా చేస్తున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాద్ చుట్టూ పక్కల నిర్వహించకుండా అంత దూరంలో లక్షమందితో సభను ఏర్పాటు చేయడం ఏంటని…కాంగ్రెస్ శ్రేణులను ఇంద్రవెళ్లి వెళ్ళకుండా నిలువరించే ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివాసీ హక్కుల పోరాట సమితి సంస్థను ముందుంచి దండోరా కార్యక్రమాన్ని నిలుపుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే సీతక్క సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తే అక్కడి వారు కొంతమంది అభ్యంతరం చేశారని అంటున్నారు. దీని వెనక ఇంటి దొంగలే ఉన్నారని…అయితే వారిని ఇప్పుడు ఏమనుకుండా సభ ముగిసిన తరువాత ఆధారాలతో పార్టీ పెద్దల ముంగిట ఉంచాలనే ప్లాన్ లో రేవంత్ ఉన్నారని అంటున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.