ఎమ్మెల్యే సారూ రాజీనామా చేసేయండి-జనాల డిమాండ్

హుజురాబాద్ బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం కేసీఆర్…అక్కడి అభివృద్ధిపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. నిధుల వరద పారిస్తున్నారు. హామీలు కాదు…సత్వరమే పనులు జరిగిపోవాలని ఆదేశిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇతర నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోంది. ఉప ఎన్నికలు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందుకే ఎమ్మెల్యే గారు రాజీనామా చేయండంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు.

తెరాస వ్యతిరేక శక్తుల సమూహం - Posts | Facebook

ఈటల రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. అక్కడ గెలుపు కోసం దళిత బంధు వంటి భారీ పతకంతోపాటు అనేక వరాలను ప్రకటించారు. కేసీఆర్ కురిపిస్తోన్న ఈ అవాజ్యమైన ప్రేమే ఇప్పుడు ఇతర నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హెడేక్ గా మారింది.

మంత్రి మల్లారెడ్డికి దెబ్బ మీద దెబ్బ.. మరోసారి తప్పని చిక్కులు - Disha  daily (దిశ): Latest Telugu News | Breaking news

ఉప ఎన్నిక వస్తేనే మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కేసీఆర్ ఇదివరకు ఇచ్చిన హామీలు నేరవేరలన్నా ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందుకే ఎమ్మెల్యే సార్ రాజీనామా చేయండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని వైరల్ చేస్తున్నారు. దీంతో ఎమ్యెల్యేలు నియోజకవర్గాల్లో తిరగడానికి భయపడి పోతున్నారు.

ఎమ్మెల్యే సారూ రాజీనామా చెయ్..! - Latest Telugu Breaking News - తొలివెలుగు  - Tolivelugu

మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా పదవికి రాజీనామా చేసి నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్దిని చాటుకోవాలని బీజేపీ రాస్తారోకో చేపట్టింది. చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు.. సోషల్‌ మీడియాలో తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

kamareddy hashtag on Twitter

అలాగే సిద్దిపేట అభివృద్ధి కోసం హరీష్ రావు కూడాచేయాలని స్థానికంగా డిమాండ్లు పెరిగాయి. భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి రాజీనామా చేయాలనీ ధర్నా చేపట్టారు. దేవరకొండ ఎమ్మెల్యేకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఈ తరహ డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అభివృద్ధి కోసం సిఎం సార్ ను కలవాల్సిన పని లేదని..ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ముఖ్యమంత్రే అభివృద్ధి భాద్యతను తీసుకుంటారని ప్రజలు చెప్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.