డేటింగ్ యాప్ లతో మంచెమిటో కాని..చెడు మాత్రమే బాగానే జరుగుతోంది. తెలియని వ్యక్తులతో డేటింగ్ యాప్ ద్వారా పరిచయాలు పెంచేసుకొని..ఆపై మోసపోవడం చాలా కాలంగా కొనసాగుతోంది. డేటింగ్ యాప్ ద్వారా చాలామంది బాధితులుగా మారుతున్న ఆ యాప్ వినియోగిస్తోన్న వారిలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలో ఓ యువతిని తన పుట్టినరోజుకు పిలిచి స్టార్ హోటల్లో అత్యాచారం చేశాడు. ముంబైకి చెందిన ఓ యువతీకి డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మాటలతో బాగానే ఆమెను ఇంప్రెస్ చేశాడు.
జూలై 26వ తేదీన ఆమె పుట్టినరోజు కావడంతో…ఆమె పుట్టిన రోజున అనుకూలంగా మార్చుకోవాలని ముందస్తు ప్లాన్ చేశాడు. ముంబైలోనే ఖరీదైన హోటల్ లో బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నట్లు చెప్పి ఆమెను అక్కడికి ఆహ్వానించాడు. అక్కడకు చేరుకున్న యువతికి మందు గ్లాస్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక తనలో నిద్రపోయిన పశు వాంఛను నిద్రలేపి యువతీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం స్పృహ వచ్చిన తరువాత తనపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న యువతీ..షాక్ కు గురయ్యైంది.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…యువతీని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.