కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది. చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ సరసన కాజల్…రాం చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తున్నారు. ఇక విలన్ గెటప్ లో అపద్బంధవుడు సోనుసూద్ నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఎప్పుడు ఈ మూవీ విడుదల అవుతుందా అని అటు మెగాస్టార్ ఫ్యాన్స్, ఇటు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో రాం చరణ్, సోనుసూద్ మధ్య భారీ పోరాట సన్నివేశాలు ఉంటాయని టాక్. అయితే చివరికీ సోనుసూద్ చరణ్ ను వెన్నుపోడుస్తాడని ఫిలిం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన శిష్యుడు అయిన రామ్ చరణ్ చావుకి కారణమైన సోను సూద్ పై చిరంజీవి పగ తీర్చుకునే కథలో భాగంగా ఈసినిమా ముందుకు సాగుతుందనేది ఈ మూవీ కథాంశంగా చెప్తున్నారు. సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుందని…థియేటర్లు కూడా ఓపెన్ అవ్వడంతో వచ్చే నెలలో ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
