వంటింటికి మహా రాణి మా అమ్మే అయినా…ఆ వంటింటి పాత్రలపై రాసి ఉంటుంది మా నాన్న పేరు. అని ఓల్గా పురుష్యాదిక్యత గురించి చాలా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా పేర్కొంది. మహిళలు అంటే వంటింటికి పరిమితం అయ్యే ప్రాణులనే చిన్న చూపు…వారంతా ద్వితీయ శ్రేణి పౌరులుగానే జీవించాలనే పురుషాధిక్య సమాజంలో మహిళలు ఇంకా అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. బయటకు వచ్చి తనకు జరిగినా అన్యాయం గురించి మాట్లాడితే తప్పనే దగ్గర నుంచి ఆమె వేసుకునే బట్టల వరకు మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతూ రావడం విషాదం.
పురుషులతో సమానంగా రానిస్తోన్నప్పటికీ మహిళలంటే ఇంకా చిన్న చూపు కొనసాగుతోంది. లోపమెక్కడ ఉందొ పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే మహిళలు తరతరాలుగా వివక్ష గురి కావాల్సి వస్తుందనేది అందరూ అంగీకరించాల్సిందే. ఆరు దశాబ్దాల గణతంత్ర భారతదేశంలో ఇంకా అస్తిత్వం కోసం ఈ దేశ మహిళలు ఉద్యమించాల్సి రావడం అత్యంత సిగ్గుచేటు. పాఠశాల స్టేజ్ నుంచే అమ్మాయిల్లో ఓ రకమైన భావజాలాన్ని నింపేసి…పురుషాధిక్య భావజాలాన్ని ప్రోది చేస్తున్నారు. అక్కడి నుంచి బయల్దేరిన ఈ పురుషాధిక్య నిరాటకంగానే కొనసాగుతోంది.
మహిళలు అంటే పురుషుడి సౌఖ్యం తీర్చే యంత్రాలనే భావనను కల్గిస్తూ ఉండటంతో..ఈవాళ వారు ధరించే బట్టలపై కూడా ఓ రకమైన నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. యూపీలో జరిగిన ఓ సంఘటనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా మహిళా సంఘాలను, విద్యార్థినిలను కలవరానికి గురి చేస్తోంది. పదిహేడేళ్ళ అమ్మాయి జీన్స్ ధరించినందుకు హత్యకు గురి అయింది.

ఇది ఎవరో చేసింది కాదు..బంధువులే ఈ దారుణాన్నికి పాల్పడ్డారంటే…పరిస్థితి ఎంతలా దిగజారిందో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు.
మహిళలు అంటే స్వేఛ్చ లేని ఓ మూగ ప్రాణిగా ఉండాల్సి సిట్యూయేషన్ దాపురిస్తోంది. తన ఇష్టాయిష్టాల గురుంచి చెప్పలేని ఓ స్థితి కల్పించింది మనువాదం. పురుషుల్లోకి ఎక్కించిన ఈ అధిక్యతే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి మహిళలను ఒక అనువుగా భావించేలా చేస్తోంది. ఇలాంటి సంస్కృతి కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకోక పోతే స్త్రీ తమ పవిత్రతను కోల్పోయినట్లుగా భావిస్తోంది పురుష ప్రపంచం. మనిషి ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు ఈ దేశంలో జెండర్ ఇక్వాలిటి సాధ్యం కానే కాదు. కేవలం ధరించే బట్టే జీవన్మరణ సమస్యగా మారిపోతు ఉందంటే ఇప్పటికీ మనం ఎక్కడో ఉన్నామో…ఏ సంఘటన చాలదు చెప్పేందుకు…ఇప్పటికైనా పురుషాధిక్యత వీడనాడితేనే దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది. లేదంటే..భారతదేశంలో జెండర్ సమాత్వం కల్లగానే మిగిలిపోతుంది.

-రమ
చైతన్య మహిళా సంఘం