కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండటంతో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒలంపిక్స్ కు ఆతిథ్యం ఇస్తోన్న టోక్యో నగరంతోపాటు మరో ఐదు పట్టణాల్లో హెల్త్ ఎమర్జెన్సీని విధించింది జపాన్. ఈ హెల్త్ ఎమర్జెన్సీ సైతమ, టోక్యో, కనగవ, ఒసాకా, చిబ, ఒకినవ ప్రాంతాల్లో ప్రకటించారు.

కరోనా గేర్ మార్చిన నేపథ్యంలో ప్రజలంతా అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని…ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని జపాన్ సర్కార్ అక్కడి ప్రజలను కోరింది. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచుతామని జపాన్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆగస్టు నెలాఖరు వరకు 40 శాతం వ్యాక్సినేషన్ టార్గెట్ గా పెట్టుకున్నామని..దానిని కంప్లీట్ చేస్తామని పేర్కొన్నారు.