రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు చేయాలనీ భావిస్తోన్న ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో జాతీయ విద్యా విధానం (5+3+3+4) ను పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మొదట తొలి దశలో 1460 పాఠశాలలో జాతీయ విద్యా విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం.
మొదటగా ఉన్నత పాఠశాలలకు కిలో మీటర్ లోపున్న పాఠశాలలను హైస్కూల్ లో విలీనం చేయలన్న ప్రతిపాదన వచ్చింది. ఇలా చేస్తే 10వేల పాఠశాలల్ని విలీనం చేయాల్సి ఉంటుంది. దీంతో పావు కిలోమీటర్ లోపున్న పాఠశాలలనే తొలి విడతలో విలీనం చేయాలని నిర్ణయించింది సర్కార్. దీంతో ఏపీ సర్కార్ మనస్సు మార్చుకుంది. ఏపీ వ్యాప్తంగా టోటల్ గా 939 ఎలిమెంటరీ పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండగా 521 పక్క పక్కనే ఉన్న పాఠశాలల్లో జాతీయ విద్యా విధానం అమలు చేయబోతున్నారు. ఆ తరువాత రెండో విడతలో మిలిగిన పాఠశాలలను కూడా ఈ విధానంలోకే మారుస్తారు. ఈ విధానం అమలు చేయడం ద్వారా ఒకే ప్రాంగణంలో ఇంటర్ విద్య కూడా అందుబాటులోకి వస్తుంది.