రేవంత్ దూకుడు -కాంగ్రెస్ కు పూర్వ వైభవం..

పీసీసీ అద్యక్ష బాధ్యతలు రేవంత్ రెడ్డికి కట్టబెట్టాక తెలంగాణ కాంగ్రెస్ లో దూకుడు పెరిగిందా…?ఇది వరకు కొత్త ఉత్సహంతో ఉన్న బీజేపీకి బ్రేక్ పడిందా…?కొంతమంది సీనియర్ కమలం నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రీజన్ ఏంటి…?మళ్ళీ కాంగ్రెస్ ఫాంలోకి వచ్చిందా..?

అవును..రేవంత్ రెడ్డికి పీసీసీ అద్యక్ష బాధ్యతలను కట్టబెట్టాక తెలంగాణ కాంగ్రెస్ లో దూకుడు పెరిగింది. వరుసగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తూ పార్టీ శ్రేణులను రేవంత్ యాక్టివ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇంటి పక్కని చక్కదిద్దితునే పార్టీకి పూర్వ వైభవం కోసం రేవంత్ శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ లో అసంతృప్త నేతలుగా ఉన్న వారితోపాటు, పార్టీతో అంటీముట్టినట్లు వ్యవహరిస్తున్న వారిని కూడా లైన్ లో పెడుతున్నారు ఆయన. ఇదివరకు నాయకత్వం మీద అసంతృప్తితో పార్టీని వీడి వెళ్ళినా వారిని, బీజేపీలో యాక్టివ్ గా లేని వారిని సైతం పార్టీలోకి ఆహ్వానిస్తు రేవంత్ సక్సెస్ అవుతున్నారు.

భూపాలపల్లి నియోజక వర్గానికి చెందిన గండ్ర సత్యనారాయణ , మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత ఎర్ర శేఖర్, నిజామాబాద్ జిల్లా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి రెడీ అయ్యారు. మరికొన్ని రోజుల్లోనే వారు అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నారు. వీరితో సాగించిన మత్రంగం వర్కౌట్ అవ్వడంతో వారంతా ఒకేసారి కాంగ్రెస్ లో చేరుతామని రేవంత్ కు హామీ ఇచ్చారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి వలసలె తప్ప…రాకలు లేని టి. కాంగ్రెస్ కు ఈ పరిణామం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

ఇక, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్తున్నా బీజేపీకి బండి సంజయ్ అద్యక్షుడు అయ్యాక కొత్త ఉత్సాహం వచ్చినా..అది మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. మొదట్లో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు కనిపించకపోవడంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. కేసీఆర్ ను త్వరలోనే జైలుకు పంపుతామని చెప్పి…ఇప్పుడు పెద్దగా నోరు మెదపకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఏదైనా అండర్ స్టాండింగ్ కుదిరిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నా వేళ..రేవంత్ కు సారధ్య బాధ్యతలు అప్పగించడంతో బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. పైగా..కేసీఆర్ ను ఎదుర్కోవడంలో రేవంత్ మాత్రమే సక్సెస్ అవుతారనే అంచనాలు ఉన్నాయి. మాటకు మాట, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించడంలో కేసీఆర్ కు రేవంత్ మాత్రమే సరితూగుతాడనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది.

ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యతిరేకులు రేవంత్ వైపు ఆశగా చూస్తున్నారు. కేసీఆర్ ను గద్దె దించడం రేవంత్ ద్వారానే సాధ్యం అవుతుందని నమ్మి…కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి కూడా రేవంత్ తో టచ్ లోకి వెళ్ళారని..ఆయన కూడా కాంగ్రెస్ లో చేరుతారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇక ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగినా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. దీంతో ప్రస్తుత రాజకీయాలు రంజుగా మరే అవకాశం కనిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో తెలంగాణ‌లో కాంగ్రెస్ దూకుడు పెర‌గ్గా… బీజేపీ దూకుడు త‌గ్గింద‌ని మేధావుల విశ్లేష‌ణ.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.