తెలంగాణ దళిత బంధును తెరపైకి తీసుకువచ్చిన కేసీఆర్…ఈ పథకంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ ప్రకటించిన ఈ పథకం అక్కడి నుంచే పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పథకానికి లక్ష కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్…ఈ దళిత బంధును వచ్చే ఎన్నికల వరకు సాగదీసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారింది. దీంతో ఇక్కడ గెలవడం కేసీఆర్ కు చాలా అవసరం. లేదంటే కేసీఆర్ ఇమేజ్ తోపాటు, టీఆర్ఎస్ లో చీలికలకు కారణం అవుతుంది. హుజురాబాద్ లో దళితుల ఓట్లు 40వేలకు ఫైమాటే. దీంతో ఆ ఓట్లన్నీ ఎటు వెళ్ళకుండా దళిత బందును కేసీఆర్ ప్రకటించారు.పైగా హుజురాబాద్ నుంచే పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తామని చెప్పారు. అయితే దళిత బందుకు కేటాయిస్తామన్న 2వేల కోట్లకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు. అలాంటిది హుజురాబాద్ కు లక్ష కోట్లు ఇస్తానంటూ కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తానని కేసీఆర్ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులకే ఏడాదికి 25వేల కోట్ల బడ్జెట్ పెట్టారు. అలా నాల్గూ ఏళ్లుగా లక్ష కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇప్పుడు దళిత బంధు కూడా లక్ష కోట్లు ఖర్చు చేయలన్నా…తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను చూస్తె ఏడాదికి 25వేల కోట్లు పెట్టాలి. అలా కేటాయించినా దళిత బంధు అందరికీ అందె సారికీ ఎన్నికలు వస్తాయి. అంటే కేసీఆర్ వచ్చే ఎన్నికల వరకు దళిత బందును సాగదీసే ఆలోచనలో ఉన్నారని విశ్లేషిస్తున్నారు. అప్పుడు రైతు బంధు ఎలాగైతే ముందుగా తెరపైకి తీసుకువచ్చి ఓట్లను దండుకున్నారో ఇప్పుడు అలాగే దళిత బంధు అంటూ ఆశ చూపి దళితుల ఓట్లను దండుకునేందుకు కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టారని అంటున్నారు.