మంత్రి కేటీఆర్ బర్త్ డే ను పురస్కరించుకొని కేటీఆర్ కు పుట్టిన రోజు విషెస్ చెబుతూనే ప్రభుత్వానికి చురకలంటించారు వైఎస్ షర్మిల. ఈ మధ్యే తెలంగాణలో వైసీఆర్ టీపీ పార్టీని ప్రారంభించిన వైఎస్ షర్మిల…నిరుద్యోగుల అంశంపై ఫోకస్ చేస్తూ నిరాహార దీక్షలు చేపడుతోంది. ప్రతి మంగళవారం దీక్ష చేపడుతోంది. ఈ క్రమంలోనే ఈవాళ కేటీఆర్ బర్త్ డే కావడంతో…ఆయనకు విషెస్ చెబుతూనే చురకలంటించారు షర్మిల. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు…నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు షర్మిల.
అనంతరం ఇంకో ట్వీట్ చేస్తూ 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇచ్చే మనసుని ఇవ్వాలని కోరుకొంటున్నానుని ట్వీట్ చేసింది షర్మిల.