ప్రత్యేక కథనం- కేటీఆర్ బర్త్ డే

తెలంగాణలో ఉద్యమంలో తండ్రికి తోడుగా…ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కోసం కదం తొక్కిన నేత. ప్రత్యేక రాష్ట్రమే శ్రీరామ రక్షా అని తండ్రి చెప్పిన మాటలను స్పూర్తిగా తీసుకొని రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన లీడర్. బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ గా…భవిష్యత్ తెలంగాణ మార్గదర్శకుడుగా అందరి నోళ్ళలో నానుతున్నా పేరు..కేటీఆర్…ఈవాళ ఆయన జన్మదిన సందర్భంగా ప్రత్యేక కథనం

కేటీఆర్…అరుదైన నాయకత్వ లక్షణాలు, సంభాషణా నైపుణ్యం, అన్నింటిని మించిన రాజకీయ చాతుర్యం కలిగిన గొప్ప యువ నాయకుడు. కేటీఆర్ అనే ఈ పదం…తెలంగాణ యువతకు ఐకాన్ గా, టీఆర్ఎస్ పార్టీ నేతలకు మార్గదర్శకులుగా, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డగా మారింది. విదేశాల్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం నిప్పై రాజుకుంటున్న వేళ…ఉద్యమానికి మద్దతుగా నిలవాలని అమెరికాలో ఆయన చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేశారు కేటీఆర్. అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చినా…ఆ లోటు ఎక్కడా కూడా కనిపించండా అనతికాలంలోనే పరిపక్వత కల్గిన నేతగా ఎదిగారు కేటీఆర్. ఓ వైపు ఉద్యమంలో పాల్గొంటునే…ఉద్యమ వ్యాప్తికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ నేతలకు దిశా నిర్దేశనం చేసే స్థాయికి ఎదిగారు ఆయన. చాలా తక్కువ సమయంలో రాజకీయాలను ఒంటబట్టించుకొని…తండ్రికి తగ్గ తనయడిగా మారారు కేటీఆర్. టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తున్నా కూడా…ప్రతికూల సమయంలో కూడా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగు లేని విజయాన్ని అందించడంలో కేటీఆర్ కీ రోల్ పోషించారు. హుజూర్ నగర్ , గ్రేటర్ ఎన్నికలు, నాగార్జున సాగర్ సెగ్మెంట్ లో ఉద్దండులైన కాంగ్రెస్ నేతలను ఓడించడంలో కేటీఆర్ కీలక భూమిక పోషించి..రాజకీయాల్లో సీనియర్లకు ఓటమి రుచి చూపించడంలో సక్సెస్ అయ్యి గ్రేట్ లీడర్ గా ఎదిగారు. ఒకానొక సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొని కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది.

ఉద్యమ సమయంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని…ఉద్యమ శక్తులతో కలిసి పని చేశారు కేటీఆర్. కేసీఆర్ స్పీచ్ తో జనాల్ని ఎలా మెస్మరైజ్ చేస్తారో..కేటీఆర్ కూడా అలాగే ఉపన్యాస కళతో జనాలకు తొందరగా చేరువయ్యారు. లీడర్ అంటే ఎలా ఉండాలో యువతకు ఒక ఇన్స్పిరేషన్ గా మారారు. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నారు. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా…మరో వైపు మంత్రిగా సమర్ధవంతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కేటీఆర్. అంతర్జాతీయ పరిశ్రమలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం వెనక కేటీఆర్ చొరవ ఉందనేది ఎవరూ కాదానలేని వాస్తవం. కొత్తగా ఏర్పాటు అయ్యే పరిశ్రమలకు అనుమతులు మంజూరు కావడంలో ఆలస్యం అవుతుందని…తద్వారా పరిశ్రమలు మరో చోటకి తరలిపోతున్నాయని ఊహించి శీగ్రగతిన అనుమతులు వచ్చే విధంగా ఐటీ మంత్రిగా విధానాలను రూపొందించారు.

పరిశ్రమలకు రాయితీలతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది కేటీఆర్ నాయకత్వంలోనే. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8%గా ఉంటే.. తెలంగాణ ఏకంగా 79 శాతం వృద్ధి సాధించిందంటే అందులో కేటీఆర్ కృషి ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ శాఖ మంత్రిగానూ ఆయన హైదరాబాద్ పరిధిలో ఎన్నో మున్సిపాలిటిలను ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడ ఎం జరిగినా వేగంగా స్పందిస్తూ సమస్యల పరిష్కరం కోసం నిధులను మంజూరు చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని ఘనగా సెలబ్రేట్ చేస్తున్నారు పార్టీ నేతలు. అయితే కేటీఆర్ మాత్రం పౌరులు, పాలకులు బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని సూచించారు. అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని, వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గిప్ట్ ఏ స్మైల‌్‌లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు.

బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్..భవిష్యత్ తెలంగాణ మార్గదర్శకుడిగా వెలుగొందుతున్న కేటీఆర్..45 వసంతంలోకి అడుగు పెట్టారు. ఆయన నాయకత్వంలో ఐటీ శాఖ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. ఫలితంగా ఎంతోమంది యువత ఉపాధి పొందుతోంది. పార్టీలోని ఎంతోమంది యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు కేటీఆర్. కేటీఆర్ అనుభువాలను, స్పూర్తిదాయక నిర్ణయాలను, చాతుర్యాన్ని చూసి పార్టీలోని కీలక నేతలు కాబోయే ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తారక రాముడి సారధ్యంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ…జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.