ఈటలను ఓడించేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్-వర్కౌట్ అయ్యేనా..?

హుజురాబాద్ లో బైపోల్ ను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజురాబాద్ లో గెలిచి.. టీఆర్ఎస్ ను ఎదిరిస్తే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో వ్యతిరేకులకు హెచ్చరికలు పంపాలని గులబీ దళపతి భావిస్తున్నారు. ఈటలను ఓడించి ఇంటా బయటా అందరికీ ఓ హెచ్చరిక పంపాలనుకుంటున్నా కేసీఆర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

హుజురాబాద్ బైపోల్ కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల మారింది. ఎలాగైనా హుజురాబాద్ లో గెలిచి తన గెలుపు గాలివాటం కాదని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు ఈటల. ఇక, టీఆర్ఎస్ మాత్రం ఈటలను ఓడించి మరోసారి అసంతృప్త రాగాలు బయట పడకుండా చూడాలనే తలంపుతో ఉంది. కేసీఆర్ రాజకీయాలను దగ్గర నుంచి చూసినా ఈటల..ఎన్నికల్లో గెలించేందుకు గులాబీ బాస్ ఎలాంటి జిమ్మిక్కులు చేస్తాడో ఊహించి పాదయత్రకు శ్రీకారం చుట్టాడు ఈటల. ఈ పాదయత్ర ఆసాంతం కేసీఆర్ చేయబోయే జిమ్మిక్కులను వివరిస్తు ముందుకు సాగుతున్నాడు. కాని ఈటలకు కౌంటర్ ఇచ్చేందుకు ఎవరూ లేరు. దీంతో తెలంగాణ దళిత బంధు పథకాన్ని పైలెట్ పథకం కింద హుజురాబాద్ లో ప్రారంభిస్తామని చెప్తున్నా..ఈటలకు వస్తున్నా ఆదరణ చూసి కేసీఆర్ స్పీడ్ పెంచారు. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించే కేసీఆర్ ఎట్టకేలకు రంగంలోకి దిగారు.

ప్రజా దీవెన పాదయత్రలో భాగంగా ఈటల ప్రతి గ్రామాన్ని చుట్టేస్తున్నారు. కేసీఆర్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో..ఆ ఓట్లను గంప గగుత్తగా టీఆర్ఎస్ కే పడేలా వ్యూహాలను రచిస్తున్నారు కేసీఆర్. ఈమేరకు ప్రతి గ్రామంలొ ప్రతి వార్డు నుంచి నలుగురు దళితులను ప్రగతి భవన్ కు రావాలని కబురు పంపారు కేసీఆర్. టోటల్ గా ఈ సెగ్మెంట్ లో 412మందిని ఎంపిక చేసి…వారందరినీ 26 న ప్రగతి భవన్ కు రమ్మని ఆహ్వానం పంపారు సిఎం కార్యాలయ అధికారులు. వారందరి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించేలా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అల్లుడితో, మంత్రి గంగులతో పని అయ్యేలా లేదనుకున్నారో ఏమో కాని స్వయంగా కేసీఆరే ఓ రకంగా ప్రచారం మొదలెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలకు ఇది చాలా డిఫరెంట్ అని, సో ఏమాత్రం తేడా వచ్చినా టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతుందని… అందుకే ఎన్ని నోట్ల క‌ట్టలు పంచినా పోదు అనేది కేసీఆర్ కు బాగా తెలుస‌ని అందుకే తానే స్వయంగా అటునుంచి న‌రుక్కొస్తున్నారంటున్నారు విశ్లేష‌కులు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.