ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రులు గెలుపు కోసమో, ప్రజల మెప్పు కోసమో ఇచ్చే హామీల అమలుపై న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎం ఇచ్చిన హామీ అమలు చేయలేదని పిటిషన్ దాఖలు చేశారు కొంతమంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇచ్చిన రూలింగ్ ఇప్పుడు రాజకీయ ప్రకంపనాలకు శ్రీకారం చుట్టబోతుంది.
ముఖ్యమంత్రులు బహిరంగ సభల్లోనో, మీడియా సమావేశాల్లోనో ఇచ్చే హామీలను అమలు చేయాల్సిందేనని..లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రులు ఇచ్చే హామీల అమలును గాలికి వదిలేస్తే కేసులు పెట్టలేమా..?అంటే కేసులు పెట్టవచ్చునని తేల్చిచెప్పింది న్యాయస్థానం. ఒక వేళ హామీలను అమలు చెయకపొతె ఎందుకు ఆ హామీలను అమలు చేయటం లేదో తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టు రూలింగ్ తో టి. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై కేసులు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ చెప్పిన దళితులకు మూడెకరాల భూమి, అమరవీరుల కుటుంబాలకు ఆర్ధిక సహాయంపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, జాబ్ నోటిఫికేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెనో అని గుర్తు చేస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పడల్లా నరం లేని నాలుక నాలుగు మాటలు మాట్లాడుతుందన్నట్లు ఎన్నో హామీలు…హుజూర్ నగర్ నుండి మొన్నటి నాగార్జున సాగర్ వరకు ఇదే తంతు. ఇలా కేసీఆర్ ఇచ్చి తప్పిన హామీలపై ఢిల్లీ హైకోర్టు కాపీ పట్టుకొని కేసులు పెడితే… కేసీఆర్ పరిస్థితేంటో?