పెగాసుస్ వ్యవహారం-తెలుగు రాష్ట్రాల సీఎంల మౌన వ్రతం..!

దేశవ్యాప్తంగా పెగాసుస్ వ్యవహారంపై బీజేపీయేతర పక్షాలన్నీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉన్న హ్యాకింగ్ అంశంపై పోరాడుతున్నాయి. ప్రతిప‌క్ష నేత‌ల‌తో పాటు జ‌ర్నలిస్టులు, మేధావులు, న్యాయవాదుల ఫోన్స్ ట్యాప్ చేసింద‌ని ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ లో ఇదే అంశంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ఫోన్ హ్యాకింగ్స్ పై దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలన్నీ నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. అందరూ ఈ అంశాన్ని బేస్ చేసుకొని బీజేపీని ఎకిపరేస్తున్నారు. ఈ నిఘా వ్యవహారంతో బీజేపీయేతర ప్రభుత్వాలని కూలదోసిందని ఆరోపిస్తున్నాయి. అయితే..తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జ‌గ‌న్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానని మాట్లాడిన కేసీఆర్…కరోనా విషయంలో ప్రధానిని వెనకకేసుకోచ్చున ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు నోరు మెదపడం లేదు. వారే కాదు… టీఆర్ఎస్, వైసీపీ నేత‌లు ఎవ‌రూ ఫోన్ హ్యాకింగ్స్ పై క‌నీసం స్పందించ‌టం లేదు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ‌లో ఫోన్ ట్యాప్ చేస్తున్నార‌ని చాలా రోజులుగా పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ పెగాస‌స్ స్పైవేర్ ఇష్యూ వెలుగులోకి వచ్చే రెండ్రోజుల ముందు కూడా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు చేశారు. ఇటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై కూడా టీడీపీ ఇదే ర‌క‌మైన ఆరోప‌ణ‌లు చేస్తోంది. అందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైలెంట్ గా ఉన్నారన్న విమ‌ర్శలొస్తున్నాయి. మాములుగానే బీజేపీని విమ‌ర్శించేందుకు ఈ రెండు పార్టీలు వెనుక‌డుగు వేస్తున్నాయ‌ని… ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ లో వీరు కూడా దోషులు కాబ‌ట్టే మాట్లాడ‌టం లేద‌ని కాంగ్రెస్ మండిప‌డుతోంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.