అసలు రంగు బయటపెట్టేసుకున్న కేసీఆర్..!

పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా ఏం మాట్లాడాలని అనుకున్నాడో ఏమో కాని…ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అసలు విషయాన్నీ బయటపెట్టేశాడు. దళిత బంధు ప్రవేశపెట్టడం వెనక అసలు రహస్యాన్ని తనంత తనే ప్రకటించారు కేసీఆర్. హుజురాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి.

కావాలనే చెప్పాడో..లేక ఎలాగైతేనేం అని అనుకోని చెప్పాడో కాని కేసీఆర్ మాత్రం అసలు రంగును బయటపెట్టేసుకున్నారు. తెలంగాణ దళిత బందు ప్రవేశపెట్టడం వెనక అసలు గుట్టును స్వయంగా కేసీఆర్ విప్పి చెప్పారు. తమది రాజకీయ పార్టీ అని చెబుతూనే…ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ స్కీం అని ఒప్పుకున్నారు కేసీఆర్. హుజురాబాద్ లో ఎన్నికలున్నాయని దళిత బంధు పెట్టినట్లు అంటున్నారని…ఖచ్చితంగా ఇదీ నూటికి నూరుపాళ్ళు నిజమేననే విధంగా కేసీఆర్ మాట్లాడారు. ఖచ్చితంగా ఒక స్కీం పెట్టిన‌ప్పుడు రాజకీయ ల‌బ్ధి కోరుకుంటం..ఏ కోరుకోవద్దా అంటూ ఎదురు ప్రశ్నించారు కేసీఆర్. కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్ పై విపక్షాలు స్పందిస్తూ కేసీఆర్ అసలు స్వరూపం బయట పడిందని విమర్శలు గుప్పిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక ఉందనే కేసీఆర్ కు దళితులు గుర్తుకు వచ్చారా..?అని ప్రశ్నిస్తునాయి. దళితులు ఆర్ధిక ఇబ్బందుల పాలు అవుతున్నారని ఇప్పుడే లైట్ వెలిగిందా అని నిలదీస్తున్నాయి.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి..మోసం చేసినప్పుడు వారు సామాజికంగా అణచివేతకు గురవుతున్నారని తెలియదా కేసీఆర్..?అని కౌంటర్ వేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని…మాట తప్పినప్పుడు వారు ఆర్థికంగా చితికిపోతున్నారని యాదికి రాలేదా…?ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క దళిత ఐఎఎస్ అధికారిని కూడా నియమించకుండా వివక్ష ప్రదర్శించినప్పుడు వారు చిన్నచూపుకు గురవుతున్నారని ఎప్పుడూ అనిపించలేదా..?అంటూ కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను అకారణంగా మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు వారికీ ఆత్మగౌరవం ఉంటుందని ఆలోచించలేదా అని నిలదీస్తున్నారు. నిజానికి కేసీఆర్ అబద్దాల పుట్టా అంటూ మండిపడుతున్నారు. ఇపుడు కౌశిక్ రెడ్డి చేరిక సందర్భంగా అసలు రంగును కేసీఆరే స్వయంగా బయటపెట్టుకున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.