10, 12 తరగతుల విద్యార్థులకు షాక్- పరీక్షలు రాయాల్సిందే..!

10, 12 తరగతులకు సంబంధించి ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండా ప్రైవేట్ విద్యార్థులకు ఫలితాలు ప్రకటించలేమని స్పష్టం చేసింది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2020-21 కు సంబంధించి విద్యా సంవత్సరం మధ్యలోనే ఆగిపోయింది. తరగతులు నిర్వహించి పరీక్షలు నిర్వహిస్తే ఎక్కడ ప్రమాదం పొంచి ఉంటుందోనని రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పైతరగతులకు ప్రమోట్ చేశాయి.

అయితే..ప్రధాని మోడీ సలహా మేరకు సిబీఎస్ఈ బోర్డు 10, 12 వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రకటించింది. ఎగ్జామ్స్ లేకుండా 10, 12 వ తరగతి ప్రైవేట్ విద్యార్థులకు ఫలితాలు ప్రకటించలేమని స్పష్టం చేసింది. ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది సిబీఎస్ఈ. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.