ఏపీలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతోన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్… ఏపీలో మరో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు.
ఏపీలో కరోనా వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వారంరోజుల పాటు నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికీ ఓ మోస్తరు సంఖ్యలో కేసులు వస్తుండడంతో కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, పీహెచ్ సీల్లోనూ ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.