గృహ నిర్బంధంపై టీ. పీసీసీ చీఫ్ , ఎంపీ రేవంత్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తనను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారని.. పార్లమెంట్ కు హజరవ్వకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
తను పార్లమెంట్ కు వెళ్లాలని ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోవటంలో లేదని… తన హక్కులకు భంగం కలిగించిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్నానని… కోకాపేటలో వేలం వేసిన భూముల్లో అవినీతి జరిగిందని పార్లమెంట్ లో ప్రస్తావించాలనుకున్న తనను ఢిల్లీ రాకుండా అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి స్పీకర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్లమెంట్ నడుస్తుంటే నన్ను అరెస్ట్ చేసేందుకు ముందుగా మీ అనుమతి తీసుకోవాలని… కానీ అలా చేయకుండా పోలీసులు చట్టాన్ని అతిక్రమించారన్నారు. వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.