తెలంగాణ గురుకులాల కార్యదర్శి, ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ కేంద్రానికి ఆయన లేఖ రాయడం సంచలంగా మారింది. తన స్వచ్చంద పదవీ విరమణ విషయాన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈమెయిల్ చేసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
రాజీనామాకు గల కారణాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ…వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నా… ఇక నుంచి తనకు ఇష్టమైన నచ్చిన పనులను చేయబోతునట్లు ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తె ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారన్న సంకేతాలు ఇస్తున్నట్టుగా కనబడుతుందని అంటున్నారు విశ్లేషకులు. పైగా కాన్షీరాం మార్గదర్శకంలో ఇక మీదట ప్రయాణిస్తానని తన లేఖలో పేర్కొనటం చూస్తె ఆయన హుజురాబాద్ బైపోల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాలన విభాగంలో ఉండటం ద్వారానే అనుకున్నది సాధించడం సాధ్యం అవుతుందని నమ్మి..ఆయన పదవికి రాజీనామా చేసినట్లు కనబడుతోంది.