జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఏపీ విద్యా విధానంలో సమూల మార్పులను చేపట్టేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం కసరత్తు కూడా ప్రారంభించింది ప్రభుత్వం. అయితే ఈ నూతన విద్యా విధానం అమలులోకి వస్తే ఏపీ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే దానిపై అటు విద్యార్థుల్లో, ఇటు వారి తల్లిదండ్రుల్లో క్లారిటీ లేదు. దీంతో వారిలో కొంత ఆందోళన అయితే నేలకోన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి సందేహాలను నివృత్తి చేసేందుకు tv6 స్పెషల్ story
ఏపీలో నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు జగన్ సర్కార్ కసరత్తును వేగవంతం చేసింది. జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త విద్య విధానానికి శ్రీకారం చుట్టింది. నూతన విద్యా విధానం అమలులోకి వస్తే…ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా మూడు రకాల విద్యా సంస్థలుంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇక నుంచి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్, 1వ తరగతి, 2వ తరగతులు..ఇలా ఐదు తరగతులుంటాయి. ఈ క్లాసులను ఫౌండేషన్ స్కూల్లుగా నామకరణం చేశారు. ఇక, ప్రిలిమినరీ స్కూళ్లల్లో 3, 4, 5 తరగతులు ఉంటాయి. అనంతరం 6,7, 8 తరగతులను మిడిల్ స్కూళ్ళుగా , 9నుంచి 12 తరగతులను సెకండరీ స్కూళ్ళుగా పిలుస్తారు.
ఈ నూతన విద్యా విధానంతో అంగన్ వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చునున్నారు. అంగన్ వాడీ కేంద్రాలను స్కూళ్లలో అనుసంధానమయ్యేలా చేయాలనే ప్రతిపాదన ఉంది. వీటిని ఫౌండేషన్ స్కూళ్లుగా పరగణిస్తారు. ఈ ఫౌండేషన్ స్కూల్లో 1, 2 తరగతులకు బోధన చేసేలా ఒక ఎస్జీటీ టీచర్ ను నియమించనున్నారు. ప్రిపరేటరీ–1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరేగా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ప్రాథమిక స్కూళ్లలో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను దగ్గరల్లోని యూపీ స్కూల్ లేదా హైస్కూళ్లకు తరలించాలని ఇందుకోసం ఓ ప్రతిపాదన కూడా సిద్దం చేశారు. 3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులనే ఇలా తరలింపు చేయాలని సూచించారు. ఇలా అదనంగా చేరిన విద్యార్థులతో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య పెరిగితే దాన్ని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తారు. 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లలో ఆయా మాధ్యమాల విద్యార్థుల సంఖ్యను అనుసరించి తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా కొనసాగిస్తారు.