హుజురాబాద్ పోటీలో నేనో ఆయనో -ఈటల జమున

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీలో ఉండేది ఈటల రాజేందారా..?లేక ఆయన భార్య జముననా..?ఇద్దరిలో పార్టీ ఎవరికీ టికెట్ ఇస్తుంది..? ఇటీవల ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. అయితే తాజాగా ఈటల భార్య జమున చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీలో ఉండేది ఈటల రాజెందరే. అందులో ఎ డౌట్ లేదని చాలా మంది అనుకుంటున్న వేళ..ఈటల జమున చేసిన కామెంట్స్ తో పోటీలో ఎవరుంటారనే విషయంలో సందిగ్దత నెలకొంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయనకు మద్దతుగా జమున ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో కమలం జెండా ఎగరేయాలని ఆమె గ్రామగ్రామానా తిరుగుతున్నారు. అయితే తాజా పర్యటనలో ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇద్దరిలో పోటీలో ఎవరుండాలనే విషయంలో నిర్ణయం తీసుకోలేదని….తన భర్త నిలబడ్డా, తాను పోటీ చేసినా ఒక్కటేనని అన్నారామె. పైగా ఉద్యమ సమయంలో ఈటల బిజీగా ఉంటే…అప్పుడు ఆయన వెనక ఉండి చక్రం తప్పింది తానేనని వివరించింది ఆమె. మా ఇద్దరిలో ఎవరికీ అవకాశం ఇస్తే..వాళ్ళు బరిలో ఉంటారని ఈటల జమున స్పష్టం చేశారు. జమున వ్యాఖ్యలతో కొంత సస్పెన్స్ అయితే వీడింది. పోటీలో తాను కూడా ఉన్నట్లు తెలిసిపోయింది.

  • Casino Munkebjerg I Vejle

    Casino Munkebjerg I Vejle Så et tilbud kan for eksempel lyde på 100% match på dit første i…
  • Casino Munkebjerg I Vejle

    Casino Munkebjerg I Vejle Så et tilbud kan for eksempel lyde på 100% match på dit første i…
  • Lovligt Og Ulovligt Spil

    Lovligt Og Ulovligt Spil Der er lavet masser af film, skrevet bøger og mange steder på int…
Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *