థర్డ్ వేవ్ హెచ్చరికలను లైట్ తీసుకుంటోన్న జనం-మాస్కుల్లేకుండానే బయటకు

కరోనా సెకండ్ వేవ్ దారుణాలను కళ్ళారా చూశాక కూడా జనం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. కరోనా క్షీణత ప్రారంభం కాగానే మళ్ళీ కరోనా నిబంధనలను గాలికి వదిలేసి ఎంచక్కా తిరిగేస్తున్నారు. ప్రజల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే థర్డ్ వేవ్ రాకకు మరెంతో సమయం కూడా పట్టదని కేంద్రం హెచ్చరించింది. మాస్క్ ల వాడకం వివరీతంగా తగ్గించారని…ఇదే కొనసాగితే థర్డ్ వేవ్ ఉదృతి తప్పదని దేశ ప్రజలను అలర్ట్ చేసింది.

మళ్ళీ అదే నిర్లక్ష్యం..మొదటి నుంచి గుణపాటలను నేర్చుకొని జనాలు సెకండ్ వేవ్ కు కారణం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్లు కనబడుతోంది. కరోనా నిబంధనలను గాలికి వదిలేశారని…లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేశక మాస్కుల వినియోగం ఏకంగా 74 శాతం తగ్గిపోయినట్టు కేంద్రం పేర్కొంది. ఆయా రాష్ట్రాలను ఆంక్షలను ఎత్తివేశాక మాస్కులను పెట్టుకోవడం మానేశారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. థర్డ్ వేవ్ ఉద్ధృతిని కొట్టిపారేయలేమని, వచ్చే 125 రోజులు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎప్పుడైతే లాక్ డౌన్ ను ఎత్తివేశారో అప్పటి నుంచి జనం మళ్ళీ కరోనాను లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారని…మే-జులై మధ్య ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు గూగుల్ మొబిలిటీ డేటా సూచిస్తోందన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. వైరస్ వ్యాప్తికి ఇది కారణం కాగలదని హెచ్చరించారు. దేశం ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరుకోలేదని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరిన్ని ఉద్ధృతులను చూడాల్సి రావొచ్చని, కాబట్టి కరోనాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వీకే పాల్ తెలిపారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఇంటర్నేషనల్

Leave a Reply

Your email address will not be published.