చాన్నాళ్ళ నుంచి ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాక నిరాశతో ఉన్నవారికీ , జగన్ హామీ మేరకు పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇచ్చారు.

కర్నూల్ జిలా నందికోట్కూర్ రిజర్వ్ స్థానం కావటంతో అసెంబ్లీకి పోటీ చేయలేకపోయిన యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి ఇచ్చారు. ఏపీ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా పేరున్న బైరెడ్డికి సముచిత స్థానం ఇస్తామని జగన్ ముందు నుండి చెప్తూ వచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ నందికొట్కూరులో బైరెడ్డి వర్గీయులే క్లీన్ స్వీప్ చేశారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చేయటం పట్ల ఆయన వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.