ఏపీలో క్యాబినెట్ విస్తరణ..?

రెండేళ్ళ తరువాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి జగన్…ఇప్పుడు క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలనీ భావిస్తున్నారా..?ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల టీంను రెడీ చేయాలనుకుంటూన్నారా..? అదే పనిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల బిజీగా ఉన్నారా…? అంటే అవున‌నే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు.

Jagan Who Is Going To Do Cabinet Expansion Soon Ysrcp Ap Government Cm  Taneti Vanitha Sucharitha Pushpa Srivani - Telugu-TeluguStop

రెండేళ్ళ త‌ర్వాత కొత్త మంత్రులు వ‌స్తార‌ని గ‌తంలో సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగానే మంత్రివ‌ర్గంలో మార్పులు చేర్పుల‌కు జ‌గ‌న్ సిద్దం అవుతున్నారు. ఇందుకోసం కొంత‌కాలంగా ఏపీ ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి ఆశావాహులైన మ‌హిళ నేత‌ల‌తో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో ముగ్గురు మహిళా మంత్రులున్నారు. ఇందులో హోంమంత్రి సుచ‌రిత పదవికి ఎ ఇబ్బంది లేకపోయినా, త‌న సామాజిక‌వ‌ర్గంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ‌వాణి, తానేటి వ‌నిత‌ల‌ను త‌ప్పించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో వొడిదెల రజిని, ఆర్కే రోజా, పాల‌కొండ ఎమ్మెల్యే క‌ళ‌వాతి, శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే ప‌ద్మావ‌తిల పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్కే రోజా విష‌యంలో ఆమె రెడ్డి సామాజిక వ‌ర్గమే ఇబ్బందిగా మారగా… రజినికి గ‌తంలోనే మంత్రిపై జ‌గ‌న్ హామీ ఇచ్చార‌న్న ప్రచారం జ‌రిగింది. కానీ ఇత‌ర మంత్రుల్లో నుండి ఒక‌ర్ని త‌ప్పించి అయినా మ‌హిళా కోట‌ను పెంచి రోజాకు అవ‌కాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇత‌ర మంత్రుల విష‌యంలోనూ సామజిక సమీకరణాల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.