ఇంటర్ ఫలితాల్లో టెన్త్ వెయిటేజీ

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఓ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇంటర్ సెకండియర్ ఫలితాల విషయంలో హైపవర్ కమిటీ రూపొందించిన రిపోర్ట్ ను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఫలితంగా ఈ నివేదిక ఆధారంగానే ఇంటర్ విద్యార్థులకు మార్కులను కేటాయించాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితాల కోసం నియమించిన హైపవర్ కమిటీ సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ ఇంటర్ విద్యార్థులు గతేడాది ఫస్ట్ ఇంయర్ పరీక్షలను రాయడంతోపాటు, అంతకుముందు రాసిన టెన్త్ పరీక్షల ఫలితాల బేస్ చేసుకొని మార్కులను ఇవ్వాలని ప్రభుత్వానికి కమిటీ ఓ నివేదికను సమర్పించినట్లు కనిపిస్తోంది. పదో తరగతి మార్కులకు 30 శాతం , జూనియర్ ఇంటర్ మార్కులకు 70 శాతం వెయిటేజ్ ను కలిపి ఇంటర్ సెకండియర్ మార్కులను ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. హైపవర్ కమిటీ రూపొందించిన నివేదికకు గనుక ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తె దీని ఆధారంగానే మార్కులను కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు పైతరగతులకు వేలేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని భావించి..మొదట ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేయాలనీ సర్కార్ భావిస్తోంది.

ఇదే సమయంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల విషయంలో మాత్రం ఇప్పటికీ ఓ క్లారిటీ అయితే లేదు. ఫలితాల విషయంలో అనేక రకాలుగా ప్రచారం అయితే జరుగుతోంది కాని..ప్రభుత్వం నుంచి కాని విద్యా శాఖ నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం మాత్రం రాలేదు. దీంతో విద్యార్థుల్లో కొంత ఆందోళన అయితే కలుగుతోంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్కులు కేటాయించే అంశంపై హైపవర్ కమిటీ పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అయితే కర్ప్యూ ప్రకటించే సమయానికే ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్ మార్కులకు కొంత మేర వెయిటేజ్ ప్రకటించాలనే ఆలోచనలో హైపవర్ కమిటీ ఉన్నట్లు సమాచారం. ఫస్టియర్ విద్యార్థులకు పదో తరగతి మార్కుల ఆధారంగా మార్కులను కేటాయించాలని అనుకున్న..గత ఏడాది ఆల్ పాస్ కావడంతో..వారి మార్కులు ప్రకటించలేదు. దీంతో హైపవర్ కమిటీ ఏమి చేయాలా అనే ఆలోచనలో పడింది. దీంతో కేవలం ఇంటర్నల్ మార్కులను బేస్ చేసుకొని ,వాటికి ప్రాక్టికల్స్ ఫలితాలను కొంత వెయిటేజ్ కలిపితే విద్యార్ధులు నష్టపోకుండా ఉంటారనే అభిప్రాయాలను కమిటీ సభ్యులు వ్యక్తపరిచినట్లు తెలిసింది. అదే సమయంలో సీబీఎస్ఈలో చదివిన విద్యార్థులకు మార్కులు ప్రకటించి ఉండటంతో.. ఆ విద్యార్థులకు ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్లో మార్కుల కేటాయింపు ఎలా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పది పరీక్షలు రాసిన వారికి, రాయకుండా పాస్ అయిన వారికీ.. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఒకే ప్రాతిపదికనమార్కులు కేటాయిస్తే.. సీబీఎస్ఈ విద్యార్థులు అన్యాయానికి గురవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలను కొందరు సీబీఎస్ఈ విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు హైపవర్ కమిటీ దృష్టికి తీసు కెళ్లారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయాలు, సూచ నలు పరిశీలించిన మీదటే ఒక నిర్ణయం తీసుకుని నివేదిక రూపొందిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ ఏడాది పరీక్షలు నిర్వహించకుండా అసెస్మెంట్ ద్వారా ఫలితాలను ప్రకటింపు ఉంటుందని వెల్లడించడంతో…వెయిటేజ్ ఎలా ఉంటుందోననే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇంటర్ ఫలితాల ఆధారంగా కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించి పలు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. కనుక, అత్యంత ప్రాముఖ్యమైన ఈ ఇంటర్ పరీక్షల ఫలితాల విషయంలో ఇంటర్నల్ ఆధార్నగా వెయిటేజ్ ప్రకటిస్తే ఆయా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల్లో అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏదీ ఏమైనా…నెలాఖరులోగా టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేయాలనీ విద్యాశాఖ భావిస్తోంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *