ఏపీలో ఇంకా కరోనా కేసులు స్థిరంగా నమోదు అవుతున్నా వేళ…వచ్చే నెలలో స్కూళ్ళను పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే…ఇంకా కరోనా పూర్తిగా కంట్రోల్ లోకి రాకముందే స్కూళ్ళను ఓపెన్ చేస్తామనే ప్రభుత్వ ప్రకటనపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తిగా అయినా తరువాత స్కూళ్ళను ఓపెన్ చేయాలనీ కోరుతున్నారు.
ఏపీలో ఆగస్ట్ 16న స్కూళ్ళను ఓపెన్ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా ఇంకా ప్రభుత్వ ప్రకటనపై ఎవరికీ నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే ఆగస్ట్ 16 నాటికీ టీచర్లకు హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాని ప్రస్తుత వ్యాక్సినేషన్ తీరు చూస్తుంటే…అప్పటి వరకు టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. ఇప్పటికే 60శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, మిగతా వారికీ త్వరలో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామంది. కాగా దీనిపై ఆఫిడవిట్ దాఖలు చేయాలనీ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను ఆగస్ట్ 11 కు వాయిదా వేసింది. ఈ విచారణ ఆగస్ట్ 11న కూడా కంప్లీట్ కాకపోతే మరోసారి కోర్టు వాయిదా వేస్తె స్కూళ్ళ ఓపెనింగ్ కు మరికాస్తా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది.
మరోవైపు ఆగస్ట్, సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్ళను ఓపెన్ చేసి చేయి కాలుచుకోవడం అంత అవసరమా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంత తొందరగా ప్రత్యక్ష బోధనకు వచ్చ్సినా తొందరేమి ఉందని నిలదీస్తున్నాయి. ఇది కేవలం విద్యార్థులకు సంబంధించిన విషయమో, టీచర్లకు సంబంధించ విషయమో కాదని ఏపీలో అన్ని వర్గాలకు సంబంధించిన విషయమని అంటున్నారు. కనుక, ఇప్పట్లో ప్రత్యక్ష బోధనను పక్కన బెట్టి ఆన్ లైన్ తరగతులను మరికొన్నాళ్ళు నిర్వహించాలని కోరుతున్నారు. లేదంటే..ఒక్క విద్యార్ధి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.