తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిపోవడంతో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖల్లో కలిపి యాభై వేల ఉద్యోగాలను మొదటి విడతలో భర్తీ చేయాలనీ, ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను రెండో విడతలో భర్తీ చేయాలనీ సూచించారు.
చాలాకాలంగా తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ ప్రభుత్వం అనుకుంటున్నా…నూతన జోన్ల విషయంలో చిక్కుముడి ఉండటంతో ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడిందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవల రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అయింది. మొదటి దశలో నేరుగా భర్తీ చేర్సే ఉద్యోగాలను భర్తీ చేయాలనీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టింది. దీని ద్వారా ఏర్పడే ఖాళీలను రెండో విడతలో ఫైల్ చేయాలనీ అనుకుంటుంది ప్రభుత్వం. ఈ నెల 13న తెలంగాణ కేబినేట్ సమావేశం అవుతుండటంతో…ఆ రోజున పూర్తి నివేదికను మంత్రివర్గ సమావేశంలో ఉంచాల్సిందిగా అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.