చిక్కుల్లో మాజీమంత్రి నారాయణ

అమరావతిలో జరిగిన భూ కుంభకోణం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని పైన నాడు సీఆర్డీఏ లో కీలకంగా పని చేసిన ఐఏఎస్ అధికారిని సీఐడి అధికారులు విచారించారు. ఆ సమయంలో పలు కీలక విషయాలు ఆయన వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ కీలకంగా మారుతున్నారు. రాజధాని ప్రాంత భూముల వ్యవహారం లో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు నాటి మంత్రులు నారాయణ, పుల్లారావుల ఒత్తిడే కారణమని సీఐడీకి ఆ ఐఏఎస్ వెల్లడించినట్టు తెలుస్తోంది. సీఆర్డీఏ ఏర్పాటుకు ముందుగానే తుళ్లూరులోని భూముల వివరాలను, రెవెన్యూ రికార్డులను నాటి మంత్రి నారాయణ తీసుకున్నారని ఆ అధికారి సీఐడీ దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. అసైన్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ భూముల విషయంలో జరుగుతోన్న తప్పిదాలను నారాయణ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదంటూ సీఐడి ముందు ఆ ఐఏఎస్ చెప్పినట్లు తెలుస్తోంది.గతంలో రెవిన్యూ రికార్డ్ లను మాయంకావడం పైనా అధికారులకు ఐఏఎస్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. 2015లో ల్యాండ్ పూలింగ్ కు ముందే 2014 అక్టోబర్ లో తుళ్లూరు మండలం రెవెన్యూ రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారని ఆ ఐఏఎస్ అధికారి చెప్పారని తెలుస్తోంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఇంటర్నేషనల్

Leave a Reply

Your email address will not be published.