కరోనా మృతుల కుటుంబాలను ఆదు కోవాల్సిందే-సుప్రీం కోర్టు డెడ్ లైన్

కరోనా మృతుల కుటుంబాలకు ఊరట కల్గించే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించింది. కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ఎంత సాయం అందిస్తారో చెప్పాలని ఆరు వారాల గడువు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విదివిధాలను ఖరారు చేసి రిపోర్ట్ చేయాలనీ కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కోవిడ్ మృతుల కుటుంబాల్లో ఫ్యూచర్ పై కాస్తా ఆశ రేకేత్తుతోంది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది వరకు కరోనా కాటుకు బలి అయినట్లు అధికారిక లెక్కలు కనిపిస్తున్నాయి. అనధికారికంగా కోవిడ్ ఖాతాల్లో జమాకాని మరణాలు ఇంకొన్ని లక్షల వరకు ఉంటాయి. కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం….గతంలోనే బాధిత కుటుంబాలకు 4 లక్షలు ఇవ్వాలని సూచించింది. అందుకు కేంద్రం నిరాకరించింది. అంత మొత్తంలో సాయం అందించడం కష్టమని….ఒక వేళ విపత్తు సహాయ నిధి కింద ఉన్న మొత్తాన్ని వారికి ఇచ్చినట్లయితే.. భవిష్యత్ లో ఏ విపత్తు వచ్చినా ఆదుకునేందుకు నిధులు ఉండవని సుప్రీంకు నివేదించింది కేంద్రం. తాజాగా పిటిషనర్ల వాదనలు విన్న సుప్రీంకోర్టు కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. నాలుగు లక్షలు ఇవ్వడం కష్టం అయితే…ఎంత ఇస్తారో స్పష్టం చేయాలనీ కోరింది. దీంతో కోవిడ్ మృతుల కుటుంబాల్లో కాస్తా ఆశ రేకేత్తుతోంది. సుప్రీంకోర్టు కేంద్రానికి ఇచ్చిన ఆదేశాలతో అటు రాష్ట్రాలకూ ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలపై ఇప్పటికే ఒత్తిడి ఉంది. సుప్రీంకోర్టు పుణ్యమా అని… కేంద్రమే.. సాయం చేయనుంది. కేంద్ర సాయానికి రాష్ట్రం ఎంతో కొంత జమ చేస్తే.. కరోనా దెబ్బకు కకావికలం అయి న కుటుంబాలు.. కాస్త నిలదొక్కుకునే అవకాశం ఉంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.