జగన్ తో అయినా జగడానికి సిద్దమే..!-వైఎస్ షర్మిల

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల..ఇంతవరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జలవివాదాలపై స్పందించకపోవడం పట్ల విమర్శలు వచ్చాయి. పార్టీ తెలంగాణలో పెడుతోన్న రాష్ట్రానికి సంబంధించిన జల వివాదం కొనసాగుతుంటే ఆమె మిన్నకుండిపోవడం పట్ల టీఆర్ఎస్ నేతలు విమర్శలను ఎక్కుపెట్టారు. ఎప్పటికైనా ఆంధ్రోల్లు అక్కడి ప్రయోజనాలే కోరుకుంటారని షర్మిలను ఉద్దేశించి మాట్లాడారు. ఇంత జరుగుతున్నా షర్మిల కౌంటర్ ఇవ్వకపోవడం పట్ల ఆమె జల వివాదాల్లో అన్నతో పోరాటానికి వెనుకడుగు వేస్తుందనే అనుమానాలు సహజంగానే కలిగాయి. ఎట్టకేలకు వైఎస్ షర్మిల స్పందించారు. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటిచుక్కను కూడా వదులుకోబోమని ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరం అయితే ఎవరితో అయినా పోరాటం చేయడానికి సిద్దమని షర్మిల పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను బట్టి…జగన్ తో అయినా జగడానికి సిద్దమేనని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.