రాజకీయ నేతలకు ఆత్మవిశ్వాసం ఉండాలే కాని, అతిగా ఉండకూడదు. ఉంటె ఎం జరుగుతుందో గత రాజకీయ పరిణామాలను గమనిస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇందంతా ఎందుకని అంటారా..? కేసీఆర్ కుక్కను పెట్టినా గెలుస్తామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇంత అహంకారామా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
ఒకప్పుడు ఎన్టీఆర్ ఇలాగే మాట్లాడి రాజకీయంగా చావు దెబ్బతిన్నాడని గతాన్ని గుర్తు చేస్తున్నారు. కల్వకుర్తి నుంచి పోటీ చేసిన సమయంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ…నా చెప్పును పెట్టిన గెలుస్తామని బీరాలు పలికాడు కాని… ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టి సామాన్యుడైన చిత్తరంజన్ దాస్ ను గెలిపించి ఎన్టీఆర్ కు గుణపాటం చెప్పారు. ఆయన పేరే పెట్టుకున్న కేటీఆర్ కూడా ఇప్పుడు దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శల పాలు అవుతున్నాడు. కుక్కను పెట్టినా గెలుస్తామని మాట్లాడటంతో ఇంత అహంకారం ఉంటుందా అని మేధావులు మండిపడుతున్నారు. ప్రజలంటే ఇంత చులకన భావమా అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ఇలా మాట్లాడి వ్యవస్థను అవమానించకూడదని సూచిస్తున్నారు. అందులోనూ ఓ బాధ్యతయుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతారా అంటూ కడిగిపరేస్తుననారు. మేము ఏం చేసినా, ఏం చెప్పినా ప్రజలు గొర్రెల్లా తలూపుతున్నారని అనుకోకండి అని కేటీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. టోటల్ గా కేటీఆర్ కామెంట్స్ తో హుజురాబాద్ లో పోటీ చేసి గెలుపొందే టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ కు కాపలాకుక్కలా ఉంటాడని ఆయన చెప్పకనే చెప్పారని సెటైర్స్ వేస్తున్నారు.