Tv6 Special Story on AP Tenth and Inter Exams

ఏపీలో ఎగ్జామ్స్ వార్ నడుస్తోంది. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ ఎపిసోడ్ లోకి టీడీపీ ఎంటర్ అవ్వడంతో ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. పరీక్షలను రద్దు చేయాలంటూ వరుసగా జూమ్ మీటింగ్ లు నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహించలేమని.. విద్యార్థుల ఆరోగ్యాన్ని డేంజర్ జోన్ లోకి నెట్టివేయవద్దని ఎగ్జామ్స్ ను రద్దు చేస్తుంటే ఒక్క ఏపీ మాత్రం… పరీక్షలను నిర్వహించి తీరుతామని ప్రతినబూనుతోంది. ఎక్కడా కూడా పరీక్షలు రద్దు చేస్తామని ప్రకటించడంలేదు. దీనిపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా ఇంకా అదుపులోకి రానేలేదు అప్పుడే పరీక్షలను నిర్వహించి… ఏపీని కరోనా కేసుల్లో నెంబర్ వన్ స్థానంలో నిలపాలని చూస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే 80 ల‌క్ష‌ల మందికి ముప్పు పొంచి ఉంటుందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఓ సూప‌ర్ స్ప్రెడ‌ర్ కార్య‌క్ర‌మం అని అన్నారు. విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఆందోళ‌న దృష్ట్యా ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు…ఏపీలో పరీక్షల ఎపిసోడ్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. మొన్న ఈ అంశంపై విచారణ జరగ్గా… సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు పంపినా అఫిడవిట్ దాఖలు చేయరా అంటూ అసహనం వ్యక్తం చేసింది. మీతోపాటు పరీక్షలను రద్దు చేయని రాష్ట్రాలైన పంజాబ్, త్రిపుర, అస్సామ్ ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా… మీరెందుకు పరీక్షలను నిర్వహించాలని అనుకుంటున్నారో చెప్పాలని నిలదీసింది. కాదు, కూడదని పరీక్షలను నిర్వహిస్తే ఒక్క విద్యార్ధి ప్రాణానికి ప్రమాదం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించింది. ఇక, సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా…. ఆ ఆదేశాలను పాటిస్తామని అన్నారు. సుప్రీంలో విచారణ సందర్బంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొనడం సరైంది కాదని… పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నా దానిపై స్పష్టానంగా తెలియజేశామని తెలిపారు. గదికి 15 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వ వాదనపై విద్యార్థుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రమే ఎందుకు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. మీ అన్నగా, మీ మామగా అంటూ మదిని దోచే మాటలు మాట్లాడే జగన్… కరోనా డేంజర్ ఇంకా ముగియలేదని, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తోన్న ఎందుకు పరీక్షలను రద్దు చేస్తూ మా ఆరోగ్య భద్రతకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. అమ్మ ఒడితో మా తల్లిదండ్రుల అకౌంట్ లోకి డబ్బులు పంపే మీరు… మేము పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తే చేస్తామని చెప్తున్నా.. చావు నోట్లోకి తలకాయ పెట్టండన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మా తల్లిదండ్రులకు ఓటు హక్కు ఉందని వారి అకౌంట్ లోకి డబ్బులు వేసి… మాకు ఓటు హక్కు లేదని మా ప్రాణాలకు పరీక్షలు పెడుతారా అంటూ మండిపడుతున్నారు.మాకు ఓటు హక్కు వఛ్చిన రోజు మా తడాకా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. టోటల్ గా… ఏపీలో పరీక్షల నిర్వహణ హాట్ హాట్ గా కొనసాగుతోంది. విద్యార్థులు కూడా ప్రభుత్వంపై వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు. పరీక్షలు రద్దు చేయకుంటే తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.