మళ్ళీ అదే తీరు. బట్ట కాల్చి మీద వేయడం అంటే ఇదే మరి. అక్షరాలకు మాంచీగా..దట్టంగా అత్తరు పూసి ఆకర్షణీయంగా కథనాలు ప్రసారం చేస్తే అబద్దం నిజమై పోతుందా..? పదాలకు రైమింగ్ తోడైతే అవాస్తవాలను ఈజీగా నమ్మేస్తారా..?ఇపుడు అలాంటి ప్రయత్నాలే చేస్తోంది మెరుగైన ఛానెల్. ఓ శిఖరం లాంటి వ్యక్తిత్వాన్ని హననం చేసే బాధ్యతను నెత్తినకెత్తుకుంది. ఇదివరకు రేవంత్ విషయంలో అసంబద్దపు వార్తలు ప్రచారం చేసి పరువు పోగొట్టుకున్న మెరుగైన మీడియా ఇప్పుడు ఈటల విషయంలో అవే పిచ్చి రాతలు రాస్తోంది. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు పనిగట్టుకొని మరీ కథనాలను ప్రచారం చేస్తోంది. ఈటల ఎపిసోడ్ లో సర్కార్ పెద్దలు ఎంత ట్రై చేసినా శిఖర సమానమైన ఆ వ్యక్తిత్వాన్ని హత్య చేసేందుకు ప్రయత్నించిన వారి ఎత్తుగడలు సక్సెస్ కాకపోవడంతో….ఇప్పుడు ఆ బాధ్యతను మెరుగైన మీడియా మోస్తోంది. ఈటల బీజేపీలో చేరడం ఖాయమైందని ఎలాంటి అధికారిక సమాచారం లేకుండానే కథనాలు ప్రచారం చేస్తోంది. తద్వారా ఈటల వెంట నడుస్తోన్న క్యాడర్ ను తప్పుదోవ పట్టించే పనిలో నిమగ్నం అయింది మెరుగైన మీడియా. బీజేపీ నేతలతో ఈటల మంతనాలు కొనసాగిస్తున్నారని…ఆయనకు రాజ్యసభ, ఈటల భార్య జమునకు ఎమ్మెల్యే టికెట్ కమలనాథులు ఆఫర్ చేశారని బోగస్ వార్తలు ప్రసారం చేస్తూ ఈటల అభిమానులను అయోమయంలోకి నెట్టేస్తోంది.
ప్రభుత్వంలో, పార్టీలో తనపై జరుగుతున్న వ్యవహారంపై కలతచెందిన కొన్ని రోజులు తరువాత ఈటల టీఆర్ఎస్ ను వీడుతారని ప్రచారం జరిగింది. అదే సమయంలో ఈటల ఓ అడుగు ముందుకు వేసి కారు గుర్తుపై గెలిచావని అనక ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తరువాత ఆయన రాజీనామా చేయడం లంచానమే. ఇక..ఈ క్రమంలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక వస్తే టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఎత్తుగడలకు పాల్పడుతుందో ముందే అంచనా వేసిన ఈటల…టీఆర్ఎస్ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు ఆ మధ్య వరుసగా కాంగ్రెస్ , బీజేపీ, టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సమావేశం అయ్యారు. ప్రధానంగా ఆ సమావేశంలో హుజురాబాద్ లో ఉప ఎన్నిక వస్తే తనకు మద్దతుగా అభ్యర్థిని పోటీకి నిలపవద్దని ఈటల కాంగ్రెస్, బీజేపీ నేతలను కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మరికొంతమంది నేతలను కూడా ఈటల కలిసి తనకు మద్దతు కూడగట్టుకునే పనిలో ఉండగా..కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కూడా సమావేశం కావలనుకున్నారు. కాని ఆ వ్యవహారాన్నికి కాస్తా మసాలా దట్టించి….బాగా స్పైసీగా ఉండేందుకుగాను ఈటల బీజేపీలోకి వెళ్తున్నారని…కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారని వార్తలు ప్రసారం చేస్తోంది మెరుగైన మీడియా. దీనిపై స్వయంగా కిషన్ రెడ్డే క్లారిటీ ఇచ్చారు. తనతో ఈటల సమావేశం కావాలనుకున్న మాట నిజమే కాని..తాము ఇంతవరకు భేటీ అవ్వలేదని తేల్చిచెప్పారు. అయినా…అక్కడితో ఆగిందా..మరింతగా వార్తలకు అత్తరు పోసి మరీ కథనాలు ప్రసారం చేసింది. గురువారమే ఆయన ఢిల్లీ ఫ్లైట్ కు హస్తిన వెళ్లి అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకుంటారని ప్రసారం చేసింది. ఇలా వార్తలు చూసిన ఈటల అభిమానులు మెరుగైన మీడియాపై మండిపడుతున్నారు. ప్రభుత్వ డైరక్షన్ లో పని చేసేంత అధమ స్థాయికి మెరుగైన మీడియా దిగజారిపోయిందని మండిపడుతున్నారు. ఈటలపై తప్పుడు కథనాలు ప్రసారం చేసి ఇజ్జత్ పోగొట్టుకోవద్దని హితవు పలుకుతున్నారు.