మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసిన బెల్లి లలిత అమరత్వం

ఆధిపత్యాన్ని అంతమొందించేందుకు పాట ఆయుధం అవుతుంది. జననినాదమై అందర్నీ ఉక్కుపిడికిలి బిగించేలా చేస్తోంది. పీడితులకు పాట ధైర్యాన్ని నూరిపోసింది. అల్లరిమూకల, ఆధిపత్యపు దురహంకారపు విధానాలను పాట ప్రశ్నిస్తుంది. ఆధిపత్యం ఆ స్వేచ్చా గానాన్ని అంతమోదించాలని చూసింది. ఆ స్వేచ్చా గీతాన్ని అలాగే వదిలేస్తే తమ పునాదులు కడులుతాయని మొదటిసారిగా పాటకు ఆధిపత్యం భయపడింది. అందుకే తెలంగాణ గానకోకిల బెల్లి లలితను అంతం చేసింది. ఇంతకీ బెల్లి లలితను చంపిందేవరు..?ఎందుకు చంపాల్సి వచ్చింది…?
voice over : అది1999 మే 26 భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లా. సూర్యాస్తమయానికి సమయం సమీపిస్తోంది. అలా సూర్యుడు అస్తమిస్తూ..పీడితుల వెలుగురేఖలను కూడా తన వెంట తీసుకువెళ్ళాడు. సరిగ్గా అప్పుడే బెల్లి లలితపై రాజ్యం కన్నెరజేసింది. నిర్బంధం, అణచివేతపై పోరుపాటను ఎక్కు పెట్టి ప్రశ్నిస్తోన్న పాట మూగబోయింది. ఆ నిర్బంధపు చీకట్లలో ప్రశ్నించే పాట అంధకారంలో కలిసిపోయింది. మరుసటి రోజు అంటే…1999 మే 27 న బెల్లి లలిత మిస్సింగ్ అనే వార్తతో భువనగిరి ప్రజలు ఆందోళనతో నిద్రలేచారు. పాటతో రాజ్యాన్ని సవాల్ చేసే ఆ ధైర్యపిపాసి అదృశ్యమైందని తెలిసి గుండెలు బాదుకున్నారు. నాటి నిర్బంధం చూసి ఎదో జరిగి ఉంటుందని భయపడిపోయారు అంతా. మా లలిత ఎక్కడా..?మా పోరు పాట ఎక్కడా అంటూ బెల్లి లలిత అభిమానులు, ప్రజా సంఘాలు, కళాకారులు, సబ్బండ వర్గాలు ఆందోళనకు దిగాయి. లలిత ఆచూకీ చెప్పాలంటూ రోడ్లమీదకు వచ్చారు.
1999 మే 29 దర్గాబావిలో ఎవరివో శరీర బాగాలు ఉన్నాయన్న వార్తతో భువనగిరి పట్టణమంతా ఉలిక్కి పడింది. అక్కడికి వెళ్ళిన వారంతా ఆ శరీర భాగాలు లలితవి కాకపోతే బాగుండునని కోరుకున్నారు. కాని కోరుకున్నదేమి జరగలేదు. అప్పటి నుంచి 13 రోజులపాటు భువనగిరి చుట్టూ పక్కల ఉన్న బావులు, చెరువుల్లో శరీర భాగాలు లభ్యం అయ్యాయి. చివరికి జూన్ 10 తల దొరకడంతో..ఆ శరీర బాగాలు లలితవేనని నిర్ధారణ అయింది. తల భాగం దొరకనంత వరకు లలిత ఆచూకీ తెలియకపోయినా పరవాలేదు కాని, ఆ శరీర భాగాలు ఆమెవి కాకపోతే బాగుండునని ప్రార్ధించారు అంతా. ఆమె పాట వింటు చైతన్యం పొందిన వాళ్ళంతా ఆ తల లలితదేనని తెలిసి బోరున విలపించారు. జూన్ 11న లలిత అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మినిస్టర్ ఎలిమినేటి మాధవ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అంత్యక్రియలకు హాజరు అయిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజంగా ఆనాటి ప్రభుత్వమే బెల్లి లలితను హత్య చేయించిందా..?పదిహేడు ముక్కలు చేసి చంపెంత నేరం లలిత ఎం చేసింది..?
పోరాట పాటకు ప్రతిరూపం బెల్లి లలిత. ఆధిపత్యం విరుచుకుపడుతున్న ప్రతి సారి స్వేచ్చాగీతం ఒకటి అగ్గిరాజులా రాజుకుంటుంది. ఆ ధిక్కార స్వరమే బెల్లి లలిత. బానిసత్వం పెంచి పోషిస్తోన్న ఆధిపత్య వర్గాలను సవాల్ చేసింది ఆమె. అగ్గి బారటలా చైతన్యాన్ని నూరిపోసింది. తెలంగాణ పోరాటంలో ఎన్నటికీ చెదరని జ్ఞాపకమై నిల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం నాంచారిపేటలో నిరుపేద కుటుంబంలో బెల్లి లలిత పుట్టింది. ఒక అన్న, ఐదుగురు చెల్లెళ్లు. తండ్రి పేద వ్యవసాయ కూలి. గొర్రెలు కాసి, ఒగ్గు కథలు చెప్పి, కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి ఆట, పాటకు తాళాలు మోగించి, గొంతులో గొంతు కలిపి పాదం ఆడించడం, పదం పలకడం చిన్ననాడే నేర్చుకుంది. బడి చదువులు కూడా పూర్తికాకుండానే.. కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నప్పటి నుంచి భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్‌‌ మిల్లులో కార్మికురాలిగా చేరింది. జీవన పోరాటంలో కార్మికురాలిగా పనిచేస్తూనే.. తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. ఆ తరువాత cituలో చేరిన బెల్లి లలిత కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాలనీ చెప్పేది. ఓ వైపు కుటుంబ బండి లాగుతూనే మరోవైపు…కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం ప్రారంభించి సమాజాన్ని క్షుణ్ణంగా చదివింది. చిన్న తనంలోనే లలితకు పెళ్లి చేయడంతో…ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఇక, భువనగిరిలో ప్రజా పోరాటాలను నిర్మించే పనిలో పడింది బెల్లి లలిత. అప్పటి భువనగిరి ఎమ్మెల్యే, హోంమంత్రి మాధవ రెడ్డి తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకేలి ఆయన తీరును ఎండగట్టింది. బస్తీవాసులను చైతన్యపరిచింది. గుక్కెడు నీలకు నోచుకోని అభాగ్యుల కోసం ఉద్యమం చేపట్టింది. తాగబోతే నీళ్ళు లేవు తుమ్మేదాలో..తడిగొంతులారిపోపాయే తుమ్మెదాలో అంటూ అప్పటి పాలక వర్గాల తీరును పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళింది బెల్లి లలిత. ఈ పాట తెలంగాణ అంతా మారుమోగింది. ఇప్పటికీ ఈ పాట వినగానే అందరికీ బెల్లి లలితే గుర్తుకు వస్తుంది. పాటతో జనాల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయవచ్చునని నమ్మి ఎన్నో పాటలను అలవోకగా అప్పటికప్పుడు అల్లి పాటతో ప్రజల్ని చైతన్యపరిచేది.
ప్రజల సమస్యలపై పాట, మాటలతో ప్రజలను చైతన్యపరుస్తూ వచ్చింది బెల్లి లలిత. 1997 మార్చిలో భువనగిరిలో జరిగిన మొట్టమొదటి ‘దగా పడ్డ తెలంగాణ’ సభను విజయవంతం చేయడంలో ఆమెది కీలకపాత్ర. బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోయడంలో ఆమె పాట, మాట ప్రత్యేకంగా నిలిచాయి. భువనగిరి సభతో మొదలై.. మెదక్, మహబూబ్‌‌నగర్, వరంగల్ జిల్లాల్లో తెలంగాణ పాటకు పర్యాయ పదంగా మారిందామె. ఆమె పౌర స్వేచ్ఛా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసింది. శ్రామిక జీవులు, బడుగు జనుల విముక్తి గీతమైంది. 1997 మార్చి 8 న జరిగిన డగా పడ్డ తెలంగాణ సభ విజయవంతమైంది. ఇందులో బెల్లి లలితే కీ రోల్ పోషించించింది. 1997 ఆగస్ట్ 11న మారోజు వీరన్న నాయకత్వంలో సూర్యాపేటలో తెలంగాణ మహా సభ జరిగింది. ఆ సభలో బెల్లి లలిత పడిన పాటల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ సభ ప్రజల్లో పాతుకుపోయిన స్వరాష్ట్ర ఆకాంక్షను మరోసారి చాటి చెప్పింది. ఆ తరువాత జరిగిన 1997 డిసెంబర్ 28న వరంగల్ సభకు వేలాదిమంది తరలివచ్చారు. ఈ సభ మరోసారి ఉద్యమ ఆకాంక్షను చాటింది. వరంగల్ సభ స్పూర్తితో తెలంగాణ చైత్యన్య వేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ కళా సమితి, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ లు ఏర్పడ్డాయి. మారోజు వీరన్న నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ మహా సభ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పీపుల్స్ వార్ కూడా మద్దతు ప్రకటించింది. దాంతో పీపుల్స్ వార్ సానుభూతిపరులు జన సభను ఏర్పాటు చేశారు. జన సభ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ కళా సమితికి కన్వీనర్ గా బెల్లి లలిత పని చేశారు. కళా సమితి కన్వీనర్ గా పాటల ద్వారా ఉద్యమానికి ఊపిరి పోసింది బెల్లి లలిత. నిర్బంధం అమలు అవుతున్న సమయంలోనూ భయం బెరుకు లేకుండా జై తెలంగాణ అని నినదించి ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది ఆమె. లలిత పాటల ద్వారా ఎంతోమంది ప్రభావితం అయ్యేవారు. నిర్భంధాన్ని ధిక్కరించి ఉద్యమంలో పాల్గొనేవారు. అది అప్పటి చంద్రబాబు సర్కార్ కు అస్సలు నచ్చలేదు. ఉద్యమం ఉదృతం అవుతూ ఉండటంతో తెలంగాణ జనసభ, కళా సమితి, స్టూడెంట్ ఫ్రంట్ పై ఉక్కుపాదం మోపింది నాటి ప్రభుత్వం. ఉద్యమం రగిలించిన పాపానికి లలిత కుటుంబ సభ్యులందరినీ పుట్టకొకరిని, గుట్టకొకరిని తరిమేసింది నాటి సర్కార్. మారోజు వీరన్న సహా భువనగిరి పరిసరాల్లో 16 మంది తెలంగాణవాదులను హత్య చేయించింది ఆనాటి సమైక్య సర్కారే.
తెలంగాణవాదులను అంతం చేస్తూ..ఉద్యమాన్ని అణచి వేయాలని భావించింది నాటి సర్కార్. ఆ పరంపర నేపథ్యంలోనే బెల్లి లలితను నాటి ప్రభుత్వమే హత్య చేసి ఉంటుందని ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. అయినా బెల్లి లలిత శరీర భాగాలను ప్రజలకు చూపకుండా.. బెల్లి లలితవి కావని బుకాయించింది ప్రభుత్వం. లలిత ఎక్కడికో నక్సల్ దళాల్లోకి వెళ్లి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసే పనికి కూడా పూనుకుంది. శారీరక సంబంధమే హత్యకు కారణమని బెల్లి లలిత ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది అప్పటి ప్రభుత్వం. బెల్లి లలిత హత్యపై సోదరుడు కృష్ణ యాదవ్ కొంతమందిపై అనుమానం వ్యక్తం చేశాడు. మాజీ నక్సలైట్ నయీంతోపాటు అతని సోదరుడు అలీమోద్దీన్ లలితను హత్య చేసి ఉంటారని ఆరోపించాడు. కాని తమకే పాపం తెలియదని నయీం సోదరుడు, అనుచరులు పేర్కొన్నారు. ఆ తరువాత బెల్లి లలితను హత్య చేసిందేవారో తేలాలని పోరాడుతున్న బెల్లి కృష్ణ యాదవ్ కు పోలిసుల నుంచి వేధింపులు మొదలు అయ్యాయి. అలాగే…ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో చివరికీ నిజాన్ని ఎక్కువ కాలం దాచలేమని అలీమోద్దీన్, శ్రీనివాస్ లను హంతకులుగా ప్రకటించారు పోలీసులు. నాటి సీఎం చంద్రబాబు కూడా బెల్లి లలిత వ్యకిత్వాన్ని హత్య చేసే పనికి పూనుకున్నారు. శారీరక సంబంధమే హత్యకు కారణమని ప్రకటించారు. బెల్లి లలిత గొంతును తెగనరికి తెలంగాణ పాటను ఆపామని కలగన్న నాటి పాలకులకు కోట్ల గొంతులతో తెలంగాణ పాట హోరెత్తుతున్నది. బెల్లి లలిత శరీరాన్ని చంపేశారు కాని….చైతన్యంతో పోరాటస్పూర్తినిచ్చే ఆమె పాటను చంపలేకపోయారు పాలకులు.
Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.