ఆహార పంపిణీ కార్యక్రమంలో చేయూతనందించిన స్వామి అలియాస్ ఇసాక్

చేసే పనిలో మంచి ఉండాలే కాని, ఆలస్యమైనా సరే మనతో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపుతారు సామజిక చింతన ఉన్నవారెవరైనా. ఆహార పంపిణీ ద్వారా టీవీ6 యాజమాన్యం ఎంతోమంది అన్నార్దుల ఆకలి తీర్చుతుందని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. మొన్న ఎల్బీ నగర్ పరిధిలోని మన్సూరాబాద్ కు చెందిన యువత tv6 యాజమాన్యంతో కలిసి ఒకరోజు ఆహారాన్ని పంపిణీ చేసేందుకు అయిన ఖర్చును భరించేందుకు ముందుకు రాగా….ఇప్పుడు యదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం సారాజిపేట గ్రామానికి చెందిన పుట్టల స్వామి అలియాస్ ఇసాక్ అనే వ్యక్తి ఈ కార్యక్రమంలో తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. లాక్ డౌన్ సమయంలో నిత్యం వందలాదిమందికి tv6 ఆహారాన్ని అందిస్తుండటంతో….ఈ కార్యక్రమంలో ఓ రోజు పాలు పంచుకొనేందుకు తన వంతు సాయంగా ఐదు వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేశారు పుట్టల స్వామి. లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నందుకు చింతిస్తున్నట్టు ప్రకటించారు ఆయన. ఇవాల్టి ఈ ఆహార పంపిణీ ద్వారా కడుపు నిండా భోజనం చేసినా వారి దీవెనలు తనకు చాలునని ఆనందం వ్యక్తం చేశాడు. అవసరంలో ఉన్నవాళ్ళకు ఆహారాన్ని అందించడం అంటే దేవుడికి నైవేద్యం సమర్పించడమేనని అన్నారు ఆయన.

ఈవాళ హైదరాబాద్ పరిధిలోని సీబీఎస్ నుంచి మొదలుకొని ఉస్మానియా ఆసుపత్రి వరకు. తిరిగి అక్కడి నుంచి ప్రారంభమై మదీనా, చార్మినార్ వరకు ఈ ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది tv6 యాజమాన్యం. ఈ దారిలో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి, నిరాశ్రయులకు, విధుల్లో ఉన్న పోలీసులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులు ఆహార ప్యాకెట్ల కోసం భారీగా తరలివచ్చారు. లాక్ డౌన్ కారణంగా బయట తినడానికి కూడా ఏమి దొరకడం లేదని….ఆకలిస్తే నీళ్ళను తాగుతూ ఆకలిని హత్య చేస్తున్నామని ఆవేదన వెళ్లబోసుకున్నారు. మాలాంటి ఎంతోమంది కడుపు నింపుతోన్న tv6 యాజమాన్యానికి కృతజ్ఞతలు అంటూ దీవెనలు అందించారు వారు. ఈవాళ ఆ మహా కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్వామి కుటుంబానికి tv6 యాజమాన్యం సెల్యూట్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో tv6 బృందం అరవింద్, అరుణ్, సాయి, చింటు, పవన్ కుమార్, సుభాష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.