తెలుగు మీడియా చరిత్రలో tv6 ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోంది. లాక్ డౌన్ కాలంలో ఎవరూ చేయని విధంగా సహాయక కార్యక్రమాలు చేపడుతు ఎంతోమంది అన్నార్థుల ఆకలి తీర్చుతూ కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. ప్రసార మాధ్యమాలు అంటే కేవలం వార్త కథనాలు ప్రసారం చేసి చేతులను దులిపేసుకోవడమే కాదని, ఏ ఆశయం కోసమైతే ఛానెల్ ను ఏర్పాటు చేశామో ఆ స్వప్నం కోసం నూటికి నూరుపాళ్ళు శ్రమించాలని స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది టీవీ6. రోడ్డుపై ఎవరో ఒకరు ఆకలితో అలామటిస్తుంటే కోతికి కొబ్బరిచిప్ప దొరికిన చందంగా…ఇలాంటి పరిస్థితులు 7 దశాబ్దాల స్వాతంత్ర్య భారతంలో ఇప్పటికీ నెలకొనడం విచారకరమని గంటలపాటు విచారం వ్యక్తం చేసే తెలుగు మీడియా…లాక్ డౌన్ కాలంలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నా వారి దుస్థితి గురించి చెప్పలేకపోతుంది. ఇలాంటి సమయంలోనే హైదరాబాద్ లో ఎంతోమంది అభాగ్యుల ఆకలికేకలను నివారించేందుకు tv6 నడుం బిగించింది. వరుసగా ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తూ ఆకలిమంటలను చల్లార్చుతోంది.
voice over : హైదరాబాద్ లో ఆకలి కేకలను నివారించేందుకు tv6 యాజమాన్యం చేపట్టిన ఆహార పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. పంజాగుట్ట నిమ్స్ నుంచి మొదలుకొని ప్రగతి భవన్ వరకునున్న ఎంతోమంది నిరాశ్రయులకు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి, నిరుపేదలకు tv6బృందం ఆహార ప్యాకెట్లను సరఫరా చేసి వారి ఆకలిమంటలను చల్లార్చింది. తిరిగి ప్రగతి భవన్ నుంచి స్టార్ట్ అయి రాజ్ భవన్, లాక్దికాపూల్, మహావీర్ హాస్పిటల్ వరకునున్న వందలాది మందికి ఆహార ప్యాకెట్లను సరఫరా చేసింది tv6 యాజమాన్యం. నిమ్స్ ఆసుపత్రి వద్ద అయితే ఆహార ప్యాకెట్లు క్షణాల్లోనే అయిపోయాయి. ఎంతోమంది ఆహర ప్యాకెట్ల కోసం రావడంతో వచ్చిన అందరికీ కాదనకుండా ఆహార ప్యాకెట్లను, వాటర్ ప్యాకేట్లతోపాటు మజ్జిగను అందజేశారు. కొన్ని చోట్ల ఆహార ప్యాకెట్లను నిరాశ్రయులకు ఇచ్చే ప్రాంతాల్లో వారి పరిస్థితిని చూసి చలించిపోయారు tv6 ఎండీ బీఎన్ చారి. ఫుట్ ఫాతే ఆశ్రయంగా మారిన దుస్థితి… దుకాణం ఆరుబయటి ప్రాంతమే సేదా తీర్చే వసతిగృహంగా మారిన పరిస్థితి..ఇలా ఎంతోమంది లాక్ డౌన్ కారణంగా రోడ్డున పడటాన్ని చూసి tv6 ఎండీ చలించిపోయారు. అన్నపూర్ణ దేశంలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు రావడం అత్యంత విషాదకరమని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రపంచ దేశాలకు సంస్కృతి నేర్పుతున్న భారతావనిలో ఆకలికేకలు వినిపించడం బాధాకరమని అందుకే….తమ పరిధిలోని ఆకలితో బాధపడుతున్న వారందరికీ ఆహార ప్యాకెట్లను అందజేసి వారి ఆకలి తీర్చడం ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో tv6 బృందం అరవింద్, అరుణ్, సాయి, చింటు, పవన్ కుమార్, సుభాష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.