ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. తారక్ కు కరోనా నెగటివ్

టాలీవుడ్ అగ్రకథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఈనెల 10న కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. డాక్టర్ల పర్యవేక్షణలో ఎన్టీఆర్ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైల్‌లో ఉన్నారు. కాగా.. ఆయన కరోనా నుంచి కోలుకున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్లు చేశాడు.

‘టెస్టు చేయించుకోగా కరోనా నెగటివ్‌గా తేలింది. నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నాకు చికిత్స అందించిన డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, నా కజిన్, కిమ్స్ డాక్టర్ వీరుకి కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే, టెనెట్ డయాగ్నస్టిక్స్ కి కూడా థ్యాంక్స్. నా ఆరోగ్యం గురించి వారు తీసుకున్న శ్రద్ధ నేను కోలుకోవడానికి బాగా ఉపయోగపడింది’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
‘కొవిడ్-19ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. అలాగే, జాగ్రత్తలు, సానుకూల దృక్పథంతో ఈ వ్యాధిని జయించవచ్చు. దీనిపై పోరాటంలో మన సంకల్ప బలమే మన అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి.. భయపడకూడదు. మాస్కులు ధరించండి.. ఇంట్లోనే ఉండండి’ అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.