కరోనా రోజువారీ కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 44,985 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,816 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో 658 కొత్త కేసులు రాగా, జిల్లాల్లో మాత్రం కరోనా వ్యాప్తి నిదానించింది. చాలా జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 5,892 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు.
తెలంగాణలో ఇప్పటివరకు 5,28,823 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 4,74,899 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 50,969 మంది చికిత్స పొందుతున్నారు.