నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టినా సాయంత్రం 4 గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశం మేఘావృతమై వర్షం పడింది. శివారు ప్రాంతాలైన జీడిమెట్ల, గాజులరామారం, దుండిగల్, కాప్రా, సుచిత్ర, కొంపల్లి, కుత్బుల్లాపూర్, ఏఎస్రావు నగర్‌తోపాటు సైనిక్ పురి, నేరెడ్మెట్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.