జూన్‌లో రెండో విడుత గొర్రెల పంపిణీ : మంత్రి త‌ల‌సాని

తెలంగాణ‌లో ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ కార్య‌క‌లాపాల‌పై ఆ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. జూన్ నెల‌ఖారు నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీకి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ బ‌డ్జెట్‌లో గొర్రెల పంపిణీకి 3 వేల కోట్లు కేటాయింపు చేశార‌న్నారు. మ‌రో 3 ల‌క్ష‌ల మందికి గొర్రెలు పంపిణీ చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. ఉపాధి హామీ కింద షెడ్ల నిర్మాణం వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. 6 ప‌శువులు ఉండేందుకు వీలుగా రూ. 57 వేల‌తో షెడ్డు నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 3,631 మంది రైతుల‌కు షెడ్ల నిర్మాణం పూర్త‌యింద‌న్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.