త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తా: పవన్‌ కల్యాణ్

కరోనా నుంచి తన ఆరోగ్యం కుదుట పడుతోందని, త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తున్నట్లు తెలిపిన ఆయన.. తాను కరోనా బారిన పడ్డానని తెలిసినప్పటి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కావాలని అందరూ ఆశించారు, వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీ నేతలు, జనసైనికులు, అభిమానులు తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు చేశారని గుర్తు చేశారు.

త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందకు వచ్చి ప్రజల కోసం నిలబడతానని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఏపీలో కరోనా బారిన పడినవారికి ఆసుపత్రుల్లో పడకలు, ఔషధాలు, ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడం దురదృష్టకమని విమర్శించారు. పరిస్ధితిని అంచనా వేయకపోవటం వలనే ఇటువంటి ఆందోళనకర పరిస్ధితి వచ్చిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.