వివేక్ తో గడిపిన క్షణాలను మర్చిపోలేను : రజనీ

సినీ హాస్యనటుడు వివేక్ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ ఆవేదనలో మునిగిపోయింది. 59 ఏళ్ల వివేక్ కార్డియాక్ అరెస్ట్ కు గురై మృతి చెందారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ… తన ఆప్త మిత్రుడు వివేక్ మరణం తనను కలచివేసిందని చెప్పారు. ఎంతో బాధ కలుగుతోందని అన్నారు. ‘శివాజీ’ సినిమా షూటింగ్ సమయంలో ప్రతి రోజు ఆయనతో సమయాన్ని గడిపానని.. తన జీవితంలో ఆ రోజులను మర్చిపోలేనని చెప్పారు. వివేక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. వివేక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Load More Related Articles
Load More By admin
Load More In మూవీస్

Leave a Reply

Your email address will not be published.