బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి

బాబా సాహెబ్ అంబేడ్కర్‌‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేడ్కర్‌ అని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు. సర్వసమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేద్కర్‌. అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళి అర్పిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశానికి అంబేడ్కర్‌ చేసిన సేవలను కొనియాడారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *