నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని అగ్రహారం తండా గ్రామపంచాయితీలో అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రంథాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి గ్రామ పెద్దలు, యువకులతో కలిసి ఎంపీటీసీ లక్ష్మన్ నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ యువ మోర్చా మండల అద్యక్షుడు రవి నాయక్ మాట్లాడుతూ.. దేశంలో అసమానత్వంపై పట్టువదలని విక్రమార్కుడిలా అక్షర సమరంపై కొనసాగించి, సమానత్వానికి బాటలు వేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ లేకుంటే ఈ దేశంలో నిమ్న కులాలు ఎప్పుడో అంతరించిపోయి ఉండేవన్నారు. కనిపించని శక్తులేవో నడిపిస్తే నడిచిన మనుషులం అన్నట్లుగా..దేశంలో ప్రతిపౌరుడు పొందుతున్న స్వేచ్చా, సమానత్వం వెనక అంబేద్కర్ కనిపించని శక్తిగా ఉన్నాడని అన్నారు రవి.
ఈ కార్యాక్రమంలో అగ్రహారం తండా ఉప సర్పంచ్ రూప్ సింగ్ నాయక్ , వార్డ్మెంబర్ సక్రి నాయక్, చారకొండ తెరాస సోషల్ మీడియా ఇంఛార్జి అంజి నాయక్,గ్రామ యూత్ సభ్యులు విజేందర్ నాయక్ ,రవి నాయక్ ,సంతోష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, రాము నాయక్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.