దేశంలో కరోనా మహమ్మారి వణికిస్తుంది. ప్రతిరోజు లక్షకు పైగా కేసులు నమోదువుతున్నాయి. ఓ పక్క కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. మరోపక్క ప్రజలు వాటిని లెక్క చేయకుండా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరణాల సంఖ్యా గణనీయంగానే ఉంది. కరోనా వ్యాక్సినేషన్ కు ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు..
ఈ నేపథ్యంలో గుర్గావ్ లోని ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. టీకా లగావో, బీర్ లేజావో అంటూ టీకా వేయించుకున్న వారికి బీర్ ఉచితంగా ఇస్తామని బంపరాఫర్ ప్రకటించింది. హర్యానాలోని గుర్గావ్ లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ఈ ఆఫర్ ప్రకటించింది. టీకీ వేసుకున్న తర్వాత ఆ టీకా కార్డు చూపిస్తే ఉచిత బీరును ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 5 నుంచి ప్రకటించిన ఈ ఆఫర్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. టీకాలు వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది.